ఎన్నికల సంఘంపై ప్రజలకు నమ్మకం అవసరం లేదా !?

ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆశ్చర్యకరంగా మారాయి. ముగ్గురు కమిషనర్లు ఉండాల్సి ఉంటే ఇద్దరే ఉన్నారు. అందులో ఒకరు రాజీనామా చేశారు. మరొక్కరే ఉన్నారు. రాజీనామా చేసిన గోయల్ ఏమీ సుద్దపూసగా కీర్తికెక్కలేదు. ఆయన కూడా ప్రభుత్వ పెద్దల సన్నిహితుడే. అయినా ఎందుకు చేశారు ?

ఎన్నికలసంఘం లో సీఈసీతో మిగిలిన కమిషనర్‌కు సరిపడలేదని మీడియా వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇటీవల బెంగాల్‌లో ఎన్నికల ఏర్పాట్ల సమీక్షించిన సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొనేందుకు గోయల్ నిరాకరించారు. తర్వతా ఢిల్లీకి వెళ్లి రాజీనామా సమర్పించారు. అంతకు ముందే.. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు విషయమంతా తెలియడంతో… ఎక్కువగా నచ్చచెప్పకుండా రాజీనామా నిర్ణయాన్ని ఆమోదించేశారు. ఇద్దరు అధికారుల మధ్య ఏం జరిగింది? ఆ విభేదాలు ఏమిటి? ఏయే అంశాలపై అభిప్రాయబేధాలు తలెత్తాయి? అనే విషయాలు బయటకు రావడంలేదు.

7న కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన సమావేశాలకు సీఈసీతో పాటు గోయల్‌ కూడా హాజరయ్యారు. కానీ ఆ మరునాడు ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ అధికారులు, కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా మధ్య జరిగిన సమావేశానికి ఆయన డుమ్మా కొట్టారు. పైగా సీఈసీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను పంపారు. నోటిఫికేషన్‌ వెలువడే వరకూ సీఈసీకి, ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు తప్ప గోయల్‌ రాజీనామా గురించి ఎవరికీ తెలియదు.

మరో రెండు, మూడు రోజుల్లో ఇద్దరు కమిషనర్లను నియమించడం ఖాయమే. ఇటీవలే ఎన్నికల అధికారులను కూడా.. కేంద్ర మే నియమించేలా చట్టంచేశారు. అంటే చెప్పినట్లుగా వినే వారినే ఎంపిక చేసుకుంటారు. మరి వారి ఆధ్వర్యంలో ఎెన్నికల నిర్వహణపై ప్రజలు నమ్మకం పెంచుకోగలరా ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గతానికి భిన్నంగా ఎన్నికలు… ఏపీ ప్రజల మద్దతు ఎవరికీ..?

ఈసారి ఏపీ ఎన్నికలు హోరాహోరీగా సాగబోతున్నాయి. వైసీపీ - కూటమి పార్టీల మధ్య నువ్వా- నేనా అనే తరహాలో బిగ్ ఫైట్ నడిచింది. డీ అంటే డీ అనే స్థాయిలో ప్రచార పర్వం...

ఏపీలో ఇంత డబ్బు.. నోట్లు ఎలా ?

ఏపీలో నోట్ల విశ్వరూపం కనిపిస్తోంది. ప్రతీ పార్టీ ఓటర్‌కు డబ్బులు పంపుతోంది. ప్రతి ఓటర్ కు నాలుగు ఐదు వందల నోట్లు చేరుతున్నాయి. యావరేజ్ గా .. ఓటుకు రెండు వేలు ఖచ్చితంగా...

తల్లి సపోర్టూ లేని జగన్ – షర్మిలను గెలిపించాలని విజయలక్ష్మి పిలుపు

జగన్మోహన్ రెడ్డి సర్వం కోల్పోయారు. చివరికి తన తల్లి సపోర్టును కోల్పోయారు. వైసీపీని ఓడించి తన కుమార్తె షర్మిలను గెలిపించాలని ఆమె అమెరికా నుంచి వీడియో విడుదల చేశారు....

స్నేహితుడి కోసమే అర్జున్ – కానీ వాడేసిన వైసీపీ

హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన కలకలం రేపింది. అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య స్నేహకు చాలా కాలం నుంచి మంచి మిత్రుడు అయిన రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎదురీదుతూండటంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close