దానంపై అనర్హతా వేటుకు బీఆర్ఎస్‌ ఫిర్యాదు – పాతవన్నీ గుర్తుకు రావా ?

దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. బీఆర్ఎస్ తరపున గెలిచినందున ఆయనపై అనర్హతా వేటు వేయాలని స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఇంకెవరూ లేనట్లుగా పాడి కౌసిక్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు వెళ్లారు. ఎడెనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా ఆయన వెంట లేరు. అనర్హతా వేటు కోసం ఫిర్యాదు చేసినట్లుగా మీడియాలో ప్రచారం జరగగానే.. మీరేం చేశారో గుర్తు లేదా.. లేకపోతే ప్రజలు మర్చిపోయి ఉంటారనుకుంటున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

గతంలో ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేకపోయినా కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించారు. కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ చివరకు సీపీఐ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. తెలంగాణ పునర్ నిర్మాణం పేరుతో శాసనసభ్యులను పదేళ్లలో ఇతర పార్టీల నుంచి మొత్తం 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకుంది. వీరిలో ఒక్కరిపైనా అనర్హతా వేటు వేయలేదు. పైగా శాసనభాపక్షం విలీనం అంటూ ప్రచారం చేశారు.

మొదటి విడతలో టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే తలసానితో రాజీనామా చేయించకుండా మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. తరవాత కాంగ్రెస్ లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అప్పటి స్పీకర్లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి అనర్హత పిటిషన్ల పైన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారని అందుకే ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని అంటున్నారు.

దానం నాగేందర్ పై అనర్హతా వేటు పిటిషన్ వేసే ముందు కొద్దిగా ఆలోచించాల్సి ఉందని.. బీఆర్ఎస్‌లోనే సెటైర్లు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ల‌వ్ మీ’ ట్రైల‌ర్‌: భ‌యంతో కూడిన ఓ ప్రేమ‌క‌థ‌!

https://youtu.be/BacOcD8e_3k?si=D6mw3GiNjusn8mnE దెయ్యంతో ప్రేమ‌లో ప‌డ‌డం ఓ ర‌కంగా కొత్త పాయింటే. 'ల‌వ్ మీ' క‌థంతా ఈ పాయింట్ చుట్టూనే తిర‌గ‌బోతోంది. ఆశిష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా ఇది. దిల్ రాజు బ్యాన‌ర్‌లో తెర‌కెక్కించారు. ఈనెల...

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close