రఘురామకు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే !?

రఘురామకృష్ణ రాజు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్. నాలుగున్నరేళ్లుగా ఆయన వైఎస్ఆర్సీపీపై, జగన్ మోహన్ రెడ్డిపై పోరాడారు. సొంత నియోజకవర్గానికి వెళ్తే ఏదో ఓ కేసులో అరెస్టు చేసి హింసిస్తారన్న కారణంగా ఇటీవలి కాలం వరకూ ఆయన సొంత నియోజకవర్గానికీ వెళ్లలేకపోయారు. తాను ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని.. నర్సాపురం నుంచేనని చెబుతూ వస్తున్నారు. పొత్తులు ఉంటాయని.. ఏ పార్టీకి సీటు దక్కితే ఆ పార్టీ నుంచి పోటీ చేస్తానని ఆయన చెబుతూ వస్తున్నారు. కానీ చివరికి ఆయన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఇప్పుడు ఆయనేం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

జగన్ ను వ్యతిరేకించే వర్గాల్లో రఘురామకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అందులో సందేహం లేదు. ఆయనకు టిక్కెట్ ఇవ్వడం అంటే.. ప్రాణాలకు తెగించి జగన్ పై పోరాడిన నేతకు గౌరవం ఇవ్వడమేనన్న అభిప్రాయం ఉంది. అందుకే టీడీపీ ఆయనకు టిక్కెట్ ఇచ్చే విషయంలో అనేక సమీకరణాలు చూసుకుంటోంది. నర్సాపురం తప్ప రఘురామకు సరిపోయే సీటు లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఆయనను అసెంబ్లీకి తీసుకు వస్తే ఎలా ఉంటుందన్న చర్చ ప్రస్తుతం టీడీపీలో జరుగుతోంది. కానీ ఇప్పటికే అన్నిసీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇప్పుడు సాధ్యమా లేదా అన్నది అర్థం కాని విషయం.

కానీ రఘురామకు అంతకు మించిన ఆప్షన్ ఉంది.. అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీనే అంటి పెట్టుకుని కేవీపీ రామచంద్రరావు ఉన్నారు. ఆయన రఘురామ వియ్యంకుడు కూడా. రఘురామకు ఉన్న క్రేజ్.. ఆయన కాన్పిడెన్స్.. ప్రకారం కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా.. నర్సాపురంలో గట్టి పోటీ ఇస్తారన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుతం బీజేపీ, వైసీపీ అభ్యర్థులు ఇద్దరూ అంత పలుకుబడి ఉన్న వారు కాకపోవడం.. రఘురామ సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యే చాన్స్ ఉంది. అది ఆయనకు ప్లస్ అవుతుంది. రఘురామరాజు ఏ నిర్ణయం తీసుకుంటారో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘క‌న్న‌ప్ప‌’ సెట్లో బాహుబ‌లి

మంచు విష్ణు ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం 'క‌న్న‌ప్ప‌'. ఈ సినిమాలో సౌత్ ఇండియ‌న్ స్టార్ల‌తో పాటు, బాలీవుడ్ స్టార్లు కూడా అతిథి పాత్ర‌ల్లో మెర‌వ‌బోతున్నారు. అక్ష‌య్‌కుమార్ శివుడి పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే....

ప్రచారంలో వైసీపీ ఇంత తేలిపోయిందేంటి !?

రాజకీయ ప్రచారం వ్యూహాత్మకంగా ఉండాలి. ప్రజల్లో మూమెంట్ తెచ్చేది ప్రచారమే. ప్రచారంలో ముందున్నారు అన్న అభిప్రాయం కలిగితే ప్రజల మూడ్ ఆటోమేటిక్ గా మారిపోతుంది. కానీ వైసీపీ ఈ ప్రచారం విషయంలో పూర్తిగా...

వైసీపీని చిత్తుగా ఓడించండి…త్రివిక్రమ్ పిలుపు

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు డైరక్టర్ త్రివిక్రమ్. ఏపీ పాలిట ఉగ్రవాదుల్లా మారిన వైసీపీని ఓడించి, కూటమిని గెలిపించాలన్నారు. త్రివిక్రమ్ వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఉంది. పవన్ కళ్యాణ్...

ఇంకా పెళ్లిళ్ల గురించి మాట్లాడితే ఎలా జ‌గ‌న్‌?

ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై జ‌గ‌న్ రెడ్డికి ఉన్న క‌సి రోజు రోజుకీ ఓ రేంజ్‌లో పెరిగిపోతోంది. ప‌వ‌న్ ప్ర‌స్తావ‌న ఎప్పుడొచ్చినా దత్త పుత్రుడు, నాలుగు పెళ్లిళ్లూ అంటూ ఈ రెండే రెండు ముక్క‌లు మాట్లాడి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close