రేవంత్ మార్క్… ఈ నాలుగు తన సన్నిహితులకే!

తెలంగాణలో పెండింగ్ లో ఉంచిన 8 లోక్ సభ స్థానాలకుగాను 4 సెగ్మెంట్ లకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. పూర్తి జాబితాను ప్రకటిస్తారని ఆశించినా ఖమ్మం, హైదరాబాద్ , కరీంనగర్, వరంగల్ స్థానాలను పెండింగ్ లో ఉంచారు.

భువనగిరి , మెదక్ ఎంపీ టికెట్ కోసం పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. భువనగిరి టికెట్ కోసం కోమటిరెడ్డి కుటుంబం గట్టిగా పట్టుబట్టింది. ఓయూ విద్యార్ధి నాయకుడు పున్నా కైలాష్ నేతతోపాటు తీన్మార్ మల్లన్న ప్రయత్నించారు. సర్వేల ఆధారంగానే టికెట్లు ఖరారు చేయాలని నిర్ణయించడంతో.. గత కొన్నాళ్లుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయించారు. చామల రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కూడా.

మెదక్ ఎంపీ అభ్యర్థిగా మొదటి నుంచి పేరు వినిపించిన నీలం మధును ఖరారు చేశారు. ఈ టికెట్ కోసం సీనియర్ నేత జగ్గారెడ్డి కుటుంబం ప్రయత్నించింది. కానీ, సర్వే రిపోర్ట్ లన్నీ నీలం మధు వైపు ఉండటంతో ఆయన పేరును ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు నీలం మధు అయితేనే గట్టి పోటీనిస్తారనే ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

నిజామాబాద్ కు సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు మొదటి నుంచి వినిపించింది. దాంతో ఆయన పేరునే అధిష్టానం ఖరారు చేసింది. ఆదిలాబాద్ లో మంత్రి సీతక్కకు సన్నిహితురాలు ఆత్రం సుగుణను అభ్యర్థిగా ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో రేవంత్ మార్క్ కనిపించింది.

ఖమ్మం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి తుమ్మల కుమారుడు యుగేందర్, మరో మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ లో ప్రవీణ్ రెడ్డి పేరును ఖరారు చేస్తారని భావించినా.. ఈ స్థానం కోసం రాజేంద్రరావుతోపాటు తీన్మార్ మల్లన్న సైతం పట్టుబడుతున్నట్లు సమాచారం. వరంగల్ టికెట్ ను సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కు ఖరారు అయిందని ప్రచారం జరిగినా.. ఈ స్థానం కోసం దొమ్మాటి సాంబయ్య, తాటికొండ రాజయ్య పేర్లను ఏఐసీసీ పరిశీలిస్తోంది. మరో విడతలో ఈ నాలుగు స్థానాలపై స్పష్టత రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో వైసీపీ ఇంత తేలిపోయిందేంటి !?

రాజకీయ ప్రచారం వ్యూహాత్మకంగా ఉండాలి. ప్రజల్లో మూమెంట్ తెచ్చేది ప్రచారమే. ప్రచారంలో ముందున్నారు అన్న అభిప్రాయం కలిగితే ప్రజల మూడ్ ఆటోమేటిక్ గా మారిపోతుంది. కానీ వైసీపీ ఈ ప్రచారం విషయంలో పూర్తిగా...

వైసీపీని చిత్తుగా ఓడించండి…త్రివిక్రమ్ పిలుపు

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు డైరక్టర్ త్రివిక్రమ్. ఏపీ పాలిట ఉగ్రవాదుల్లా మారిన వైసీపీని ఓడించి, కూటమిని గెలిపించాలన్నారు. త్రివిక్రమ్ వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఉంది. పవన్ కళ్యాణ్...

ఇంకా పెళ్లిళ్ల గురించి మాట్లాడితే ఎలా జ‌గ‌న్‌?

ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై జ‌గ‌న్ రెడ్డికి ఉన్న క‌సి రోజు రోజుకీ ఓ రేంజ్‌లో పెరిగిపోతోంది. ప‌వ‌న్ ప్ర‌స్తావ‌న ఎప్పుడొచ్చినా దత్త పుత్రుడు, నాలుగు పెళ్లిళ్లూ అంటూ ఈ రెండే రెండు ముక్క‌లు మాట్లాడి...

అఫీషియ‌ల్‌: స‌ల్మాన్ తో ర‌ష్మిక‌

ర‌ష్మిక జాక్ పాట్ కొట్టేసింది. ఓ క్రేజీ సినిమాలో ఆఫ‌ర్ అందుకొంది. స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. `సికింద‌ర్‌` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో ర‌ష్మిక‌ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close