మీడియా వాచ్ : వాలంటీర్లు కొనడం ఆపేస్తే పాతాళంలోకి సాక్షి సర్క్యులేషన్ !

సాక్షి పత్రికను కొనాలని వాలంటీర్లకు ప్రతీ నెలా రూ.రెండువందలు అదనంగా ఇస్తూ జారీ చేసిన జీవో ఉపసంహరించుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే ప్రభుత్వం ఇప్పటి వరకూ ఆ పేరుతో వాలంటీర్లకు ఇస్తున్నడబ్బులన్నీ అక్రమమే. ఆ డబ్బులన్నీ సాక్షి పత్రిక యాజమాన్యానికే చేరుతున్నాయి. రెండున్నర లక్షల మంది వాలంటీర్లు.. రెండు న్నర లక్షల కాపీల్ని కొంటున్నారంటే మామూలు విషయం కాదు.

ప్రజాధనంతో పేపర్లు కొనిపించి సర్క్యులేషన్ చూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఈనాడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించంది. ఈ క్రమంలో ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్… తాజాగా గణాంకాల్లోనూ ఈనాడే ముందు ఉందని సాక్షి వెనుక ఉందని తెలిపింది. అంటే ఎంత అధికార దుర్వినియోగం చేస్తున్నా సాక్షి పత్రిక ఈనాడు దరి దాపుల్లోకి కూడా రావడం లేదు. ఏపీలో సాక్షి దినపత్రికను కొనేవారి సంఖ్య చాలా పరిమితంగా ఉంటోంది.

ప్రజాధనంతోనే లక్షల కాపీల్ని కొంటున్నారు. రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు రూ. రెండు వందలు ఇచ్చి మరీపేపర్ కొనిపించారు. అలాగే ఒక్కో గ్రామ, వార్డు సచివాలయంలో రెండేసి పేపర్లు వేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల్ని బెదిరించి పేపర్లు కొనిపిస్తున్నారు. యూనివర్శిటీలు సహా ఇతర చోట్ల.. బలవంతంగా పేపర్ అంట కడుతున్నారు. ఇంత చేస్తున్నా ఆ పత్రిక సర్క్యూలేషన్ … ఏపీలో ఐదారు లక్షల లోపే ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే డబ్బులు పెట్టే కొనే నిఖార్సైన పాఠకులు సాక్షి పత్రికకు పూర్తిగా అడుగంటి పోయారని స్పష్టమవుతోంది.

ఖచ్చితంగా ఏపీలో సాక్షికి డబ్బులు పెట్టి కొనే చందాదారులు లక్ష నుంచి రెండు లక్షలు లోపే ఉంటారని భావిస్తున్నారు. ఇంత చేసినా సాక్షి పేపర్ మెరుగుపడకపోవడంతో ప్రభుత్వం మారితే కప్పకూలిపోతుందన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. అసలు సర్క్యూలేషన్ లేకపోయినా వందల కోట్ల ప్రజాధనం .. ఆ పత్రికకు కట్టబెడుతున్నారు. మొత్తంగా ఈనాడు … కరోనా అనంతర పరిస్థితుల్ని తట్టుకుని నిలబడుతోంది కానీ.. సాక్షి పునాదులు కదిలిపోయాయని… అప్పనంగా దొరకిన అధికారంతో ప్రజాసొమ్ముతో నిలబెడుతున్నారు. అధికారం పోయిన మరుక్షణం సాక్షి దోచిన ప్రజాధనం కక్కించకుండా ఉండరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close