బీజేపీని కేసీఆర్ ఏమీ అనరా !?

కేసీఆర్ మళ్లీ ఫీల్డ్ లోకి వస్తున్నారు. కానీ ఆయన పూర్తిగా కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకుంటున్నారు. తన పార్టీకి ముప్పుగా మారుతున్న బీజేపీని మాత్రం పల్లెత్తు మాట అనలేకపోతున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పేరు బయటకు వచ్చిన తర్వాత ఆయన బీజేపీపై యుద్ధం ప్రకటించారు. కవితను బీజేపీలోకి రావాలని బెదిరించారని లేకపోతే కేసులు, అరెస్టులు తప్పవని బెదిరించారని పార్టీ కార్యవర్గ సమావేశంలో ఏడాదిన్నర కిందట చెప్పారు. తగ్గేది లేదని.. యుద్ధం ఖాయమేనన్నారు. చివరికి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వరకూ అదే జరిగింది. తర్వాత బీజేపీ అంటే పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

ఇప్పుడు కేసీఆర్ బీజేపీతో యుద్ధం కాదు కదా కవితను అరెస్టు చేసినా మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. బీజేపీని ఒక్క మాట అనడం లేదు. కవితను అరెస్టు చేసిన రోజున కేటీఆర్ బీజేపీ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు కానీ కేసీఆర్ మాత్రం ఒక్క విమర్శ కూడా చేయలేదు. కేసీఆర్ పూర్తిగా రాష్ట్రంలో ఉన్న కరువుకు కాంగ్రెస్‌ను బాధ్యురాల్ని చేసి బీఆర్ఎస్ కు ఓట్లేయించుకోవాలన్న వ్యూహం పాటిస్తున్నారు. బీజేపీ విషయంలో ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. సీఏఏను అమల్లోకి తెచ్చినా బీఆర్ఎస్ స్పందించలేదు. నిజానికి సీఏఏ అంశం బీఆర్ఎస్‌కు కీలకం. ముస్లిం వర్గాల మద్దతు కూడగట్టుకోవడానికి ఈ అంశంపై బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడే అవకాశం ఉండేది. కానీ కేసీఆర్ వదలుకున్నారు.

నిజానికి బీజేపీ ఇప్పుడు తెలంగాణలో.. బీఆర్ఎస్‌కు ముప్పుగా మారింది. ప్రతిపక్ష స్థానాన్ని కైవసం చేసుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ కన్నా ఎక్కువ సీట్లు.. ఎక్కువ ఓట్లు వస్తే ఆ తర్వాత జరగబోయే రాజకీయ పరిణామాలను అంచనా వేయడం కేసీఆర్ వల్ల కూడా కాదు. భారతీయ జనతా పార్టీని ఎదిరిస్తే ఇప్పుడు మరిన్ని కష్టాలు వస్తాయని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. అందుకే ఆ పార్టీపై వీలైనంత మౌనం పాటిస్తోంది. ఇదే అలుసుగా బీజేపీ.. బీఆర్ఎస్ స్థానాన్ని కాంగ్రెస్ సాయంతో ఆక్రమిస్తున్నట్లుగా రాజకీయ పరిణామాలు నిరూపిస్తున్నాయి. అయినా కేసీఆర్ నిస్సహాయ స్థితిలో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విశ్వ‌క్‌సేన్ కోసం బాల‌య్య‌

నంద‌మూరి హీరోలంటే విశ్వ‌క్‌సేన్‌కు ప్ర‌త్యేక‌మైన అభిమానం. ఎన్టీఆర్‌కు విశ్వ‌క్ వీరాభిమాని. ఎప్పుడు ఎన్టీఆర్ ప్ర‌స్తావన వ‌చ్చినా, ఊగిపోతాడు. బాల‌కృష్ణ‌తో కూడా మంచి అనుబంధ‌మే ఉంది. విశ్వ‌క్‌సేన్ గ‌త చిత్రానికి ఎన్టీఆర్ గెస్ట్ గా...
video

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ ట్రైల‌ర్‌: ఇది మ‌రో ర‌కం సినిమా

https://youtu.be/UY31pDh055o?si=kVsguDvBSdE7xJ5Y 'మాస్ కా దాస్' అనే ట్యాగ్ లైన్‌కి త‌గ్గ‌ట్టుగా సినిమాలు చేసుకొంటూ వెళ్తున్నాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న నుంచి వ‌స్తున్న మ‌రో పూర్తి స్థాయి మాస్‌, మ‌సాలా, పొలిటిక‌ల్ ధ్రిల్ల‌ర్‌... 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి'....

బీఆర్ఎస్ ను బుక్ చేసిన సీబీఐ మాజీ జేడీ..!?

ఏపీకి రాజధాని లేకపోవడంతో మరో పదేళ్లు హైదరబాద్ నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ డిమాండ్ పట్ల బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇటీవల...

పెళ్లి గేమ్‌లో పాండ్యా హిట్ వికెట్ అయ్యాడా ? తెలివిగా తప్పించుకున్నాడా ?

క్రికెటర్ హార్జిక్ పాండ్యా ఇప్పుడు హాట్ టాపిక్. ముంబైకి కెప్టెన్ గా ఆయన భయంకరమైన ట్రోల్స్ ఎదుర్కొన్నారు. అదే సమయంలో ముంబై టాప్ ఫోర్ కు చేరుకోలేకపోయింది. ఆ షాక్‌లో ఉండగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close