‘రాజాసాబ్‌’… విజువ‌ల్ ఫీస్ట్

ప్ర‌భాస్ – మారుతిల ‘రాజాసాబ్’ క‌థేంటి? ఎలా ఉండ‌బోతోంది? అనే విష‌యాల‌పై ఎవ‌రికీ పెద్ద‌గా ఐడియా లేదు. సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాలుగా మాట్లాడుకోవ‌డం త‌ప్ప‌, ఈ సినిమా ఏ జోన‌ర్‌లో వెళ్ల‌బోతోంద‌నే విష‌యంపై క్లారిటీ లేదు. చిత్ర బృందం కూడా ‘రాజాసాబ్’ క‌థ గురించి ఇప్ప‌టి వ‌ర‌కూ నోరు విప్ప‌లేదు. మారుతి బ‌లం.. వినోదం. త‌న కామెడీ స్టైల్ భ‌లే ఉంటుంది. ప్ర‌భాస్ కూడా కామెడీ చేసి చాలా కాలం అయ్యింది. అందుకే.. వీరిద్ద‌రి నుంచి వినోద ప్ర‌ధాన‌మైన సినిమానే వ‌స్తుంద‌ని అంతా అనుకొంటున్నారు. కానీ ట్విస్ట్ ఏమిటంటే… ఈ సినిమా ఓ విజువ‌ల్ ఫీస్ట్ గా ఉండ‌బోతోంది. మారుతి ఎప్పుడూ లేని విధంగా ఈసారి గ్రాఫిక్స్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్ పై దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

‘రాజాసాబ్‌’లో హార‌ర్ కోణం ఉంది. అయితే దానికి గ్రాఫిక్స్ మిళితం చేసి… తెర‌పై ఓ కొత్త ప్ర‌పంచాన్ని సృష్టించ‌బోతున్నాడ‌ట మారుతి. ద్వితీయార్థంలో వ‌చ్చే ఆ సన్నివేశాలు ప్రేక్ష‌కుల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్ల‌బోతున్నాయ‌ని టాక్‌. ఓ హార‌ర్ సినిమాలో గ్రాఫిక్స్ ని ఈ రేంజ్‌లో ఎవ‌రూ వాడలేద‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మారుతికి మంచి విజువ‌ల్ సెన్స్ వుంది. సినిమాల్లోకి రాక‌ముందు ఆయ‌న సౌత్‌లో నెంబర్ వ‌న్ యానిమేట‌ర్‌. అయితే త‌న విజువ‌ల్ సెన్స్‌ని చూపించే అవ‌కాశం ఇప్ప‌టి వ‌ర‌కూ రాలేదు. దాన్ని ‘రాజా సాబ్’ కోసం వాడ‌బోతున్నార్ట‌. `రాజాసాబ్‌` షూటింగ్ చాలా నిదానంగా సాగుతోంది. మ‌ధ్య‌మ‌ధ్య‌లో బ్రేకులు వ‌స్తున్నాయి. అయితే ఆ గ్యాప్ లో మారుతి విజువ‌ల్ సెన్స్‌పై దృష్టి పెట్టాడ‌ని, దాన్ని త‌న సినిమాకు అనుకూలంగా మార్చుకొంటున్నాడ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ‘రాజా సాబ్‌’ షూటింగ్ సాగుతోంది. ఈ షెడ్యూల్ లో సంజ‌య్ ద‌త్ పై కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close