హంతకుడితో బీహార్ మంత్రిగారు జైల్లో విందు భోజనం!

మొహమ్మద్ షాబుద్దీన్…ఈ పేరుని చాలా మంది ఇదివరకు వినే ఉంటారు. బిహార్ నేర ప్రపంచంలో తిరుగులేని నాయకుడు అతను. లాలూ ప్రసాద్ యాదవ్ కి చెందిన ఆర్.జె.డి.పార్టీలో ఒకప్పుడు సభ్యుడు. అతనిపై అనేక హత్యలు, కిడ్నాపుల కేసులలో న్యాయస్థానాలలో అనేక కేసులు పెండింగులో ఉన్నాయి. ఒక హత్య కేసులో అతనిని కోర్టులు దోషిగా నిర్ధారించడంతో గత పదేళ్ళుగా బిహార్ లోని శివాన్ జైల్లో యావజీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు.

అటువంటి వ్యక్తితో నితీష్ కుమార్ ప్రభుత్వంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్న అబ్దుల్ గఫూర్ మొన్న మార్చి 6న జైల్లో విందు భోజనం చేసారు. మంత్రిగారు ఒక హంతకుడితో కలిసి జైల్లో విందు భోజనం ఆరగిస్తున్నపుడు తీసిన ఫోటోలు మీడియా చేతికి చిక్కడంతో అవి బిహార్ మీడియాలో విస్తృతంగా ప్రచురింపబడ్డాయి. దానితో ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీజేపీ నితీష్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలుపెట్టింది.

“మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి జైల్లో ఉన్న ఒక హంతకుడితో విందు భోజనం చేయడం గమనిస్తే, అటువంటి నేరస్తులకు ప్రభుత్వ అండదండలు పుష్కలంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. మంత్రులే నేరస్తులతో ఈవిధంగా భుజాలు రాసుకొని తిరుగుతూ, జైల్లో ఉన్న హంతకులతో విందు భోజనాలు చేస్తుంటే రాష్ట్రంలో నేరస్తులకు ప్రభుత్వమే భరోసా కల్పిస్తునట్లుంది. ఇంక రాష్ట్రంలో నేరాలు పెరగకుండా ఉంటాయా? అని రాష్ట్ర బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ ప్రశ్నించారు.

ఆ ప్రశ్నలకు మంత్రి అబ్దుల్ గఫూర్ ఆ విమర్శలకు జవాబిస్తూ “నేను ఒక పని మీద శివాన్ వచ్చేను. అప్పుడు సమీపంలోనే ఉన్న జైల్లో షాబుద్దీన్ ఉన్నాడని తెలుసుకొని వెళ్లి కలిశాను. ఒకప్పుడు మేమిద్దరం మా పార్టీలో కలిసి పనిచేసాము. ఆ కారణంగానే అతనిని ఓసారి పలకరించి పోదామని జైల్లోకి వెళ్లి కలిసేను తప్ప నాకు వేరే ఉద్దేశ్యమేమీ లేదు,” అని చెప్పారు.

ఇక లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పిన జవాబు ఇంకా బాగుంది. “సాధారణంగా మంత్రులు లేదా ప్రజా ప్రతినిధులు జైల్లో ఉన్నవాళ్ళని కలవడానికి వచ్చినప్పుడు జైలు అధికారులే వాళ్ళకి అల్పాహారం, ఛాయ్ వంటివి ఏర్పాటు చేస్తుంటారు. అబ్దుల్ గఫూర్ వెళ్ళినప్పుడు కూడా అదే జరిగింది. దానిని మీడియా భూతద్దంలో నుండి చూపిస్తూ తప్పుగా చిత్రీకరించింది,” అని చెప్పారు.

వారిద్దరి మాటలు విన్నట్లయితే జైల్లో ఉన్న ఒక హంతకుడిని కలవడం వారు తప్పుగా భావించడం లేదని అర్ధమవుతోంది. మంత్రిగారయితే మరో అడుగు ముందుకు వేసి అటువంటి కరడుగట్టిన నేరస్థుడితో ఇదివరకు కలిసి పనిచేశానని చాలా గొప్పగా చెప్పుకొన్నారు. అతను కోర్టులు నేరస్తుడని నిర్ధారించి జైల్లో పెట్టినప్పటికీ తమ బంధం తెగిపోలేదని మంత్రిగారు స్వయంగా చెప్పుకోవడం విశేషం. అందుకు సాక్ష్యంగా జైల్లో షాబుద్దీన్ తో కలిసి ఆయన విందు భోజనం చేసిన ఫోటోలున్నాయి.

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ వ్యవహారంపై ఇంకా స్పందించలేదు. తన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆర్.జె.డి. పార్టీకి చెందిన ఆ మంత్రిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనే సాహసం ఆయనకి ఉందో లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close