రేవంత్ సర్కార్ చేస్తున్న అప్పుల కన్నా “రీ పే” ఎక్కువ !

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అప్పులు భారీగా చేస్తోందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. తాము తెచ్చిన అప్పుల కన్నా చెల్లించేది ఎక్కువని లెక్కలు విడుదల చేసింది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలు కలిపి తిరిగి చెల్లించేందుకు గడిచిన 125 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సగటున ఒక రో జుకు రూ.207 కోట్లు ఖర్చు పెట్టినట్లుగా లెక్కలు విడుదల చేశారు. అప్పటి అప్పులకు వడ్డీలు, కిస్తీలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది.

దుబారా లేకుండా ప్రతి పైసాకు జవాబుదారీగా ఉండేలా ఖర్చులపై నియంత్రణను అమలు చేస్తున్నామని.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం కంటే ఎక్కువ తిరిగి చెల్లిస్తున్నామని చెబుతోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసింది. వాటికి చెల్లించాల్సిన వడ్డీలు, నెలసరీ చెల్లింపులు తడిసి మోపడయ్యాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు డిసెంబర్ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్, బడ్జెటేతర రుణాలన్నీ కలిపి రూ. 17,618 కోట్ల అప్పులు చేసింది.

ఇదే వ్యవధిలో రూ.25, 911 కోట్లు అప్పులకు సంబంధించిన తిరిగి చెల్లింపులు చేసిందని అంత మేరకు తెలంగాణ ప్రజలపై మోపిన రుణభారం తగ్గిందని ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో ప్రభుత్వం ప్రజోపయోగమైన నిర్మాణాలకు, పనులకు మరో రూ.5,816 కోట్లు మూలధన వ్యయంగా ఖర్చు చేసిందని చెబుతున్నారు. కొంతమేరకు అప్పులను నియంత్రించటంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించామని జీఎస్‌డిపి ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం తక్కువ అప్పులు చేయటం కొత్త మార్పునకు సంకేతమని చెబుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అదే జరిగితే సజ్జల పరిస్థితి ఏంటి..?

వైసీపీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుండటంతో జగన్ రెడ్డి ఆత్మగా చెప్పుకునే సజ్జల రామకృష్ణ పరిస్థితి ఏంటనేది బిగ్ డిబేట్ గా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నాన్నాళ్ళు తనే సీఎం అనే తరహాలో...

థియేట‌ర్లు క్లోజ్.. హీరోల షేర్ ఎంత‌?

తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ మూత‌ప‌డ‌డంతో టాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. నిజానికి ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తుంద‌న్న భ‌యం, ఆందోళ‌న అంద‌రిలోనూ ఉంది. అది ఒక్క‌సారిగా నిజ‌మ‌య్యేస‌రికి అవాక్క‌య్యారు. నిజానికి నెల రోజుల...

ఐ ప్యాక్ బృందానికి జగన్ రెడ్డి వీడ్కోలు..?

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీకి సేవలందించిన ఐ ప్యాక్ కార్యాలయానికి జగన్ రెడ్డి ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్...

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close