క‌న్న‌ప్ప సెట్లో అక్ష‌య్ కుమార్‌

`క‌న్న‌ప్ప‌` కు స్టార్ బ‌లం పెరుగుతూ పోతోంది. ఇప్ప‌టికే ప్ర‌భాస్, మోహ‌న్ లాల్‌, శివ‌రాజ్ కుమార్‌, న‌య‌న‌తార‌.. వీళ్లంతా ఈ ప్రాజెక్ట్ లో భాగం పంచుకొన్నారు. అక్ష‌య్ కుమార్ శివుడిగా న‌టించ‌బోతున్నాడంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు అదే నిజ‌మైంది. క‌న్న‌ప్ప సెట్లో శివుడు ఎంట్రీ ఇచ్చేశాడు. ఈ విష‌యాన్ని… చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇందుకు సంబంధించి ఓ వీడియో కూడా విడుద‌ల చేసింది. అక్ష‌య్‌, విష్ణు, మోహ‌న్ బాబు.. క‌లిసిన ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అక్ష‌య్ కుమాన్ న‌టిస్తున్న తొలి సౌత్ ఇండియ‌న్ మూవీ ఇదే. ఈ ప్రాజెక్టు కోసం అక్ష‌య్ వారం రోజుల కాల్షీట్లు కేటాయించిన‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల లుక్ టెస్ట్ కూడా జ‌రిగింద‌ని, శివుడి పాత్ర‌లో అక్ష‌య్ ప‌ర్‌ఫెక్ట్ గా సెట్ అయ్యార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో `క‌న్న‌ప్ప‌` షూటింగ్ జ‌రుగుతోంది. ఈ వారం రోజుల్లో అక్ష‌య్ పై కీల‌క సన్నివేశాల్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ ఆగ‌మ‌నం కూడా ఖాయంగా క‌నిపిస్తోంది. ప్ర‌భాస్ నందీశ్వ‌రుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close