మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకును వెంటాడుతున్న హిట్ అండ్ ర‌న్ కేసులు

బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసులో తవ్విన‌కొద్దీ నిజాలు బ‌య‌ట‌కొస్తూనే ఉన్నాయి. ఓ కేసులో తీగ‌లాగితే గ‌తంలో జ‌రిగిన కేసుల్లో త‌ను త‌ప్పించుకున్న తీరు బ‌య‌ట‌కు రావ‌టంతో పాత కేసుల‌ను కూడా పోలీసులు రీఓపెన్ చేస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు మ‌ద్యం మత్తులో ప్ర‌జా భ‌వ‌న్ ముందు బారీకేడ్ల‌ను ఢీకొట్టి వెళ్లిపోయాడు. పోలీసులు అరెస్ట్ చేశాక‌, ష‌కీల్ కొడుకు రాహెల్ ప్లేసులో మ‌రొక‌రిని స‌రెండ‌ర్ చేసి వెళ్లారు. ఇదంతా పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్ సీసీ కెమెరాల‌తో పాటు దాడి జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దీంతో హైద‌రాబాద్ సీపీ సీరియ‌స్ అయి, పంజాగుట్ట స్టేష‌న్ సిబ్బందిని మొత్తం మార్చేశారు. ఆఫీస‌ర్ల‌ను అరెస్ట్ కూడా చేశారు.

అయితే, దుబాయ్ పారిపోయిన రాహెల్ ఇటీవ‌లే హైద‌రాబాద్ వ‌స్తూ పోలీసుల‌కు చిక్కాడు. దీంతో కేసు ద‌ర్యాప్తు స‌మ‌యంలో పోలీసుల‌కు గ‌తంలో జూబ్లీహిల్స్ లో జ‌రిగిన హిట్ అండ్ ర‌న్ కేసులో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పడ్డాయి.

రెండేళ్ల క్రితం జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 లో హిట్ అండ్ ర‌న్ కేసు న‌మోదైంది. బెలూన్లు అమ్ముతూ రోడ్డు దాటుతున్న కాజోల్ చౌహాన్ అనే మహిళను ఓ కారు ఢీకొట్టింది. దీంతో కాజోల్ చేతిలో ఉన్న రెండు నెలల శిశువు కింద ప‌డిపోయి, అక్క‌డికక్క‌డే మృతిచెందాడు. కాజోల్ కూడా తీవ్రంగా గాయ‌ప‌డింది. ప్ర‌మాదం జ‌ర‌గ్గానే ముగ్గురు వ్య‌క్తులు అక్క‌డి నుండి పరార‌య్యారు. అయితే, ఆ వాహ‌నంపై ఎమ్మెల్యే ష‌కీల్ స్టిక్క‌ర్ ఉండ‌టంతో పోలీసులు విచార‌ణ చేయ‌గా, కొడుకు రాహెల్ అందులో లేడ‌ని అబ‌ద్దం చెప్పించి మ‌రో వ్య‌క్తి లొంగిపోయారు. పోలీసులు కూడా ఆ కేసును అక్క‌డితో అప్ప‌ట్లో ముగించారు. కానీ ఇప్పుడు ఆ కేసును బ‌య‌ట‌కు తీసి విచారిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close