కేసీఆర్‌, కేటీఆర్‌కు అతి పెద్ద సమస్య రేవంత్ రెడ్డి !

కేటీఆర్, కేసీఆర్ కు అతి పెద్ద సమస్యగా కనిపిస్తున్నది రేవంత్ రెడ్డినే. వీరు మైక్ పట్టుకుంటే రేవంత్ భజన చేస్తున్నారు. రేవంత్ లో ఆందోళన కనిపిస్తున్నదని.. ఆయన బీజేపీలోకి పోతారని జోస్యం చెబుతున్నారు. ఎన్నికల తర్వాత ఏదేదో జరుగుతుదందని బహిరంగసభల్లో తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి రాజకీయం రేవంత్ చేసుకుంటారు.. ఆయన ఏదో చేస్తారని చెప్పినంత మాత్రాన ప్రజలు బీఆర్ఎస్ ఓటేస్తారా అనే సందేహం కార్యకర్తలకు వస్తుంది . ఈ విషయం కేసీఆర్, కేటీఆర్ కూ తెలుసు. కానీ ఇప్పుడు వారి సమస్య.. రేవంత్ రెడ్డి.

తెలంగాణలో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుదంని సర్వేలు చెబుతున్నాయి. రెండో స్థానంలో బీజేపీ ఉంటుంది. బీఆర్ఎస్ ఒక్క సీటు మాత్రమే అతి కష్టం మీద వస్తుందని చెబుతున్నారు ఇలాంటి ఫలితాలు వస్తే.. రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత తన విశ్వరూపం చూపిస్తారు. బీఆర్ఎస్ పార్టీలో మిగిలిన నేతల్ని చెల్లా చెదురు చేస్తారు. పదేళ్ల పాలనలో అడ్డూ అదుపూ లేకుండా చేసిన అక్రమాలకు లెక్కలేనన్ని సాక్ష్యాలను వదిలి పెట్టారు. అధికారం తమ చేతుల్లోనుంచి పోదన్న ధీమాతో తప్పుడు పనులు చేశారు. అన్నింటినీ చూపించి జైలుకు పంపడం పెద్ద విషయం కాదు.

పార్లమెంట్ ఎన్నికల కోసమే రేవంత్ రెడ్డి ఆగుతున్నారని కేసీఆర్, కేటీఆర్ కూ తెలుసు. రేవంత్ రెడ్డిపై కేసీఆర్ పాల్పడిన వేధింపులు చిన్నవి కావు. బిడ్డ పెళ్లికి బెయిల్ పై రావాల్సిన పరిస్థితి కల్పించారు. పదేళ్ల పాటు మీడియాను అడ్డం పెట్టుకుని వేసిన నిందలు.. చేసిన వేధింపులు రేవంత్ అంత త్వరగా మర్చిపోరు. వీటికి ప్రతిఫలంగా తమను జైలుకు పంపడం ఖాయమని కేసీఆర్, కేటీఆర్ ఆందోళనతో ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డి సీఎం పీఠంపై ఉండకూడదని.. ఉండరని చెప్పుకుంటున్నారు.

కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, కవిత అరెస్టు వంటి అంశాలపై ఒక్క మాట మాట్లాడేందుకు కేసీఆర్ కు నోరు రావడం లేదు. కానీ రేవంత్ రెడ్డి ముఖంలో భయం కనిపిస్తోందని.. ఆయనపదవిలో ఉండరని జోస్యం మాత్రం అసువుగా చెప్పేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేయకూడదని నిర్ణయించుకునే ప్రజలకు కేసీఆర్ ప్రసంగాలు జస్టిఫికేషన్ ఇస్తున్నట్లున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మళ్లీ అదే నినాదం ఎత్తుకున్న మోడీ – ఏంటి సీక్రెట్ ..?

కొద్ది రోజులుగా కాంగ్రెస్ పై ఎదురుదాడి చేయడానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రధాని తాజాగా మరోసారి 400సీట్లు అంశాన్ని తెరపైకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో బీజేపీ గతం కన్నా ఎక్కువగా సీట్లు...

ఆ విషయంలో మంత్రులు ఫెయిల్..!?

కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ గా ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నా ఒకరిద్దరూ మంత్రులు మినహా మిగతా వారెవరూ పెద్దగా స్పందించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. వీటన్నింటికి రేవంత్ ఒక్కడే కౌంటర్ ఇస్తున్నారు తప్పితే మంత్రివర్గం...

ఇలా అయితే కుదరదు మార్చాల్సిందే…త్వరలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం

తెలంగాణ సీఎంవోను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారా..? ఫైల్స్ క్లియరెన్స్ లో అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదులు అందటంతో సమర్ధవంతమైన అధికారులను నియమించాలని ఫిక్స్ అయ్యారా..? ఎన్నికల కోడ్ ముగియగానే సీఎంవోలో...

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close