ఇంత జరుగుతున్నా ఏపీ విషయంలో ఈసీ స్పందనేది !?

ఏపీలో జరుగుతున్న పరిణామాలు, అధికారులు ఈసీని సైతం ధిక్కరిస్తున్న వైనం సంచలనంగా మారుతోంది. అయితా ఈసీ అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏపీలో పోలీసు వ్యవస్థ పనితీరుపై లెక్కేలేనన్ని విమర్శలు వస్తున్నాయి. సీఎం జగన్ పై రాయి దాడి జరిగితే కనీస చర్యలు లేవు. భద్రతాలోపం స్పష్టంగా కనిపించింది. ఓ పద్దతి లేకుండా పోలీసులు పని చేస్తున్నారు. పూర్తిస్థాయి డీజీపీ లేకపోవడం వల్లనేనని ఈసీకీ పదే పదే ఫిర్యాదులు చేసినా స్పందన ఉండటం లేదు.

ఢిల్లీలో ఈసీ ఎన్డీఏ కూటమి తరపున ఫిర్యాదు చేశారు. గతంలో పురందేశ్వరి అధికారుల తీరును వివరిస్తూ.. గతంలో వారు చేసిన పనులను చెబుతూ.. నిష్పాక్షికమైన అధికారుల్ని నియమించాలని కోరుత లేఖలు రాశారు. సీతారామాంజనేయులు, రిషాంత్ రెడ్డి ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. సీఎస్ వ్యవహారశైలి మరీ ఘోరంగా ఉంది. తప్పు చేసిన వారిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఉన్నా చేయడంలేదు.

అతి కష్టం మీద ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై ఈసీ చర్యలు తీసుకుంది. వాసుదేవరెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇస్తారో లేదో తెలియదు. ఏపీలో మద్యం పాలసీపై ఎన్నికల కోడ్ రాక ముందు నుంచీ తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. వాసుదేవరెడ్డి ఏపీ అధికారి కాదు. ఆయన ఐఆర్టీఎస్ అధికారి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన డిప్యూటేషన్ పై ఏపీలో పని చేయడానికి వచ్చారు. నాలుగేళ్లుగా ఆయన బేవరేజెస్ కార్పొరేషన్ లోనే ఉన్నారు. ఎన్నికల సమయంలో వైసీపీకి కావాల్సింతమద్యం స్టాక్ పంపారని ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. అతి కష్టం మీద ఆయనను బదిలీ చేయించగలిగారు.

సీఎస్, డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్ ను మారిస్తే తప్ప ఎన్నికలు సజావుగా సాగుతాయన్న నమ్మకం ఎన్డీఏ కూటమికి లేదు. కానీ వారిని మార్చే విషయంలో ఈసీ ఎన్ని ఫిర్యాదులు వచ్చినా స్పందించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close