RRR రికార్డ్ బ్రేక్ చేసిన ‘పుష్ష 2’

‘పుష్ష 2’ రికార్డుల వేట మొద‌లైంది. మొన్న‌టికి మొన్న ‘పుష్ష 2’ హిందీ డీల్ క్లోజ్ అయ్యింది. దాదాపు రూ.200 కోట్లు హిందీ రైట్స్ రూపంలో వ‌చ్చాయి. ఆడియో రైట్స్ విష‌యంలోనూ పుష్ష దే రికార్డు. ఏకంగా రూ.65 కోట్ల‌కు టీ.సిరీస్ సంస్థ చేజిక్కించుకొంది. ఇప్పుడు ఓటీటీ ప‌రంగానూ పాత రికార్డుల‌న్నీ ‘పుష్ష 2’ తిర‌గరాసేసింది. ‘పుష్ష 2’ ఓటీటీ హ‌క్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ.275 కోట్ల‌కు కొనుగోలు చేసింద‌ని స‌మాచారం. ఇది ఆల్ టైమ్ రికార్డ్‌! ఇది వ‌ర‌కు ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ రైట్స్ రూ.200 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి. ఆ రికార్డ్ ఇప్పుడు ‘పుష్ష 2’ చెరిపేసింది.

కేవ‌లం నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ రూపంలోనే రూ.500 కోట్ల పైచిలుకు సంపాదించేసింది. ‘పుష్ష 2’కి రూ.450 కోట్ల బ‌డ్జెట్ అయ్యిందని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. వ‌డ్డీల‌కూ, ప్ర‌మోష‌న్లకూ మ‌రో రూ.50 కోట్లు అనుకొన్నా.. రూ.500 కోట్ల లెక్క తేలింది. అదంతా నాన్ థియేట్రిక‌ల్ నుంచే వ‌చ్చేసిందంటే.. ఇక థియేట‌ర్ నుంచి వ‌చ్చేదంతా లాభ‌మే అనుకోవాలి. ఆగ‌స్టు 15న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నామ‌ని చిత్ర‌బృందం ముందే ప్ర‌కటించింది. అనుకొన్న స‌మ‌యానికి సినిమాని సిద్ధం చేయాల‌ని ద‌ర్శ‌కుడు సుకుమార్ అహ‌ర్నిశ‌లూ క‌ష్ట‌ప‌డుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన అప్‌డేట్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

ఐపీఎల్ బిగ్ ఫైట్- కేకేఆర్ ను ఎస్.ఆర్.హెచ్ మ‌డ‌త‌పెట్టేస్తుందా?

ఐపీఎల్ లో కీలక సమరానికి రంగం సిద్దమైంది. లీగ్ మ్యాచ్ లు పూర్తి కావడంతో మంగళవారం తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగబోతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ - కోల్ కత్తా నైట్ రైడర్స్...

‘భ‌జే వాయు వేగం’… భ‌లే సేఫ్ అయ్యిందే!

కార్తికేయ న‌టించిన సినిమా 'భ‌జే వాయు వేగం'. ఈనెల 31న విడుద‌ల అవుతోంది. ఈమ‌ధ్య చిన్న‌, ఓ మోస్త‌రు సినిమాల‌కు ఓటీటీ రేట్లు రావ‌డం లేదు. దాంతో నిర్మాత‌లు బెంగ పెట్టుకొన్నారు. అయితే...

తెలంగాణలోని వర్సిటీలకు వైస్ ఛాన్సలర్ ల నియామకం

తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్ లను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. నేటితో వీసీల పదవీకాలం ముగియడంతో కొత్త వీసీల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఇంచార్జ్ వీసీలను నియమించింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close