జగన్ తో స్నేహానికి కాంగ్రెస్ సంకేతాలు ఇస్తోందా?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టి పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్న పసిపిల్లలను అడిగినా సరే.. టక్కున సమాధానం వచ్చేస్తుంది… ఆ పార్టీ సర్వనాశనం అయిపోయిందని! పూర్తిగా పతనం అయిపోయిన ఆ పార్టీ ఇప్పట్లో లేచి నిలబడడం కూడా సాధ్యం కాదని కూడా తమ అభిప్రాయం చెబుతారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ కి సంబంధించి నంత వరకు ఇక సొంత కాళ్ళ మీద లేచి నిలబడడం అనేది అసాధ్యం. అందుకే కాబోలు వైసీపీ తో స్నేహ బంధం కోసం వారు ఇప్పుడు సంకేతాలు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. వైసీపీ ఎటొచ్ఛీ ఉన్న బలం కొద్ది కొద్దిగా కోల్పోతున్నది గనుక.. ఈ సమయంలో తాము స్నేహహస్తం చూపితే అంగీకరించవ్చచునని బహుశా వారి ఆలోచన కావచ్చు.

కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ విషయంలో ఆ పార్టీ నాయకులకు పూర్తి క్లారిటీ ఉంది. కనీసం తమ ఉనికి కాపాడుకోవాలంటే… ఎక్కువ కష్టపదాలని వారికీ తెలుసు. అందుకే వైసీపీ వదిలేసిన, టీడీపీ సీరియస్ గా పట్టించుకోని ప్రత్యెక హోదా గురించి ఉద్యమిస్తున్నారు. ఢిల్లీ వెళ్లి తాము సేకరించాం అని చెబుతున్న కోటి సంతకాలను పార్టీ పెద్దల చేతిలో పెట్టి వచ్చారు. అయితే ఢిల్లీ లో కేవలం సోనియా తో సమర్పణ పర్వం కాకుండా మరొక కీలక పరిణామం కూడా జరిగింది.

ఏపీ కాంగ్రెస్ నాయకులతో , రాహుల్ విడిగా సమావేశం అయ్యారు. వారికి దిశానిర్దేశం చేసేందుకు ప్రయత్నించారు. బహుశా ఆ భేటీలో అయన జగన్ తో సత్సంబంధాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.

ఇవాళ తాజాగా కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ది కోసం పనిచేసే ఏ పార్టీ పొరడినా వెనక ఉంది మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పార్టీల్లో టీడీపీ, బీజేపీ లు ప్రభుత్వం నడుపుతున్నాయి గనుక.. వారు పోరాడటం భ్రమ. సానుకూలంగా సాధించాలి అని వారు అంటూనే ఉన్నారు. ఇక అంతో ఇంతో పోరాటం అనే మార్గం నమ్ముకుని ఉన్నది వైసీపీ మాత్రమే. ఈ పోకడను గమంచినప్పుడు, జగన్ తో చాలా దగ్గరి సంబంధాలు కలిగి ఉండే.. కేవీపీ ఇప్పుడు అయన పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడానికి, వైసీపీ తో కాంగ్రెస్ స్నేహ బంధానికి తపన పడుతున్నారేమో అనిపిస్తోంది. జగన్ కు ప్రస్తుతం వేరే గత్యంతరం లేకపోయినప్పటికీ వీరి పరోక్ష ప్రతిపాదనకు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ నేతలు కోరుకున్న డోస్ ఇచ్చేసిన మోదీ

చిలుకలూరిపేట సభలో ప్రధాని మోదీ తమను పెద్దగా విమర్శించలేదని .. ఆయనకు తమపై ప్రేమ ఉందని.. తమ నేతను జైలుకు పంపబోని గట్టిగా ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు.. ప్రధాని మోదీ...

సెన్సార్ అయ్యింది..కానీ స‌ర్టిఫికెట్ లేదు!

'ప్ర‌తినిధి 2' విచిత్ర‌మైన స‌మ‌స్య‌లో ప‌డింది. నిజానికి గ‌త వార‌మే విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. కానీ.. సెన్సార్ ఆఫీస‌ర్ సెల‌వులో ఊరు వెళ్ల‌డం వ‌ల్ల, సెన్సార్ జ‌ర‌క్క‌, ఆగిపోయింది. ఇప్పుడు సెన్సార్...

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

అలాగైతే రాజ‌మౌళితోనే సినిమాలు చేసేవాడ్ని!

నారా రోహిత్ కెరీర్ చాలా డీసెంట్ గా మొద‌లైంది. 'బాణం', 'సోలో', 'ప్ర‌తినిధి' లాంటి మంచి సినిమాల్ని అందించారాయన‌. రోహిత్ ఓ క‌థ ఎంచుకొన్నాడంటే అందులో విష‌యం ఉండే ఉంటుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగించాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close