వాట్ ఈజ్ దిస్ ల‌క్ష్మీ..??

క‌థానాయకుల కుమార్తెలు.. క‌థానాయిక‌లుగా హ‌ల్ చ‌ల్ చేయ‌డం తెలుగునాట అరుదైన విష‌య‌మే. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ ఇళ్ల నుంచి క‌థానాయిక‌లెవ్వ‌రూ రాలేదు. మోహ‌న్ బాబు మాత్రం త‌న కుమార్తె మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌కు అడ్డు చెప్ప‌లేదు. అయితే ల‌క్ష్మీ ప్ర‌స‌న్న కూడా త‌న స్థాయికి త‌గిన పాత్ర‌ల‌నే ఎంచుకొంటోంది. హీరోల‌తో డ్యూయెట్లు పాడే సినిమాల‌కు నో చెబుతోంది. ప్ర‌తినాయ‌కురాలిగానూ న‌టించ‌గ‌ల‌గ‌డం ఆమెకున్న అద‌న‌పు అర్హ‌త‌. అందుకే మోహ‌న్ బాబు కూడా.. ఎప్పుడూ `ప్రొసీడ్‌` అంటూ ప్రోత్స‌హిస్తూంటారు. అయితే ఇటీవ‌ల మంచు ల‌క్ష్మి న‌టించిన ‘గుంటూర్ టాకీస్‌’ చూసి మోహ‌న్‌బాబు షాక‌య్యార‌ట‌. ఈ సినిమాలో ఓ చిన్న పాత్ర‌లో క‌నిపించింది ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌. `ఇలాంటి చిన్న చిన్న పాత్ర‌లు ఎందుకు చేస్తావ్‌? అదీ ఇలాంటి బీ గ్రేడ్ సినిమాల్లో అస్స‌లు న‌టించ‌కు` అని మొహం మీదే చెప్పేశాడ‌ట‌. ‘అది ఫ్రెండ్ షిప్ కొద్దీ చేశా… డాడీ’ అంటూ స‌ర్దిచెప్ప‌బోయినా.. మోహ‌న్ బాబు ఏమాత్రం విన‌లేదట‌. `ఇక ముందు.. ఇలాంటి సినిమాలు చేస్తే నిన్ను ఎంకరేజ్ చేసేది లేదు..` అని వార్నింగ్ ఇచ్చాడ‌ట మోహ‌న్ బాబు. ఎప్పుడూ లేనిది డాడీ ఇలా అనేసరికి ల‌క్ష్మీ కూడా చిన్న‌బోయింద‌ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close