తెలకపల్లి వ్యూస్ : కోదండ పార్టీలో చేరనంటే ఏం చేస్తాం?

ఒక దశలో తాము ఎంతగానో ఉపయోగించుకున్న సంస్థలను వేదికలను పాలకులు కాలగర్భంలో కలిపేయడం మొదటి నుంచి వున్నదే. వ్యక్తులను కూడా కొన్ని సార్లు కొంత కాలం నెత్తిన పెట్టుకోవడం, తర్వాత పూర్తిగా పక్కకు నెట్టేయడం చాలాసార్లు చూశాం. కాని తెలంగాణ జెఎసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ఉదంతం వీటన్నిటికన్నా చాలా విడ్డూరమనిపించడానికి కారణాలున్నాయి.

కొన్నేళ్లపాటు ఆయన తెలంగాణ ఉద్యమానికి ప్రతినిధిగా ప్రతీకగా నిలిచారు. కెసిఆర్‌ తన రాజకీయ వ్యూహాలు లాబీయింగులు కొనసాగిస్తుంటే కోదండరాం మిగిలిన పార్టీలు సంఘాలతో కలసి చర్చించి సమరశీలమైన పిలుపులు ఇస్తూ వచ్చారు. వాటిలో కేసిఆర్‌ కొన్నిసార్లు పాల్గొన్నారు కొన్నిసార్లు దూరంగా వున్నారు. ఏమైనా ఈ క్రమంలో ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు ఆయన నాయకత్వంలోని వేదికలో పాలుపంచుకోవడం వల్లనే ప్రధానంగా బలం వచ్చింది. సకల జనుల సమ్మె అందులో చాలా ముఖ్యమైంది. మిలియన్‌ మార్చ్‌ సాగరహారం వంటివి పెద్ద సంచలనమే కలిగించాయి. కోదండరాం వాటికి అగ్రనేతగా నిలిచారు.

అయితే రాష్ట్రం ఏర్పడుతున్నకొద్ది తనను రాజకీయంగా పక్కనపెట్టడం పరిపాటిగా మారింది. చెప్పాలంటే ఒక్కసారి కూడా ఆ ప్రొఫెసర్‌తో కెసిఆర్‌ వివరంగా మాట్లాడిన సందర్భమే లేకుండా పోయింది. నాటకంలో పాత్ర ముగిసినట్టుగా తయారైంది. ఆయన రిటైరైనప్పుడుకూడా అధికారికంగా గౌరవ పూర్వక సత్కారం లభించలేదు. ఈ సమయంలో కొన్నిసార్లు టిఆర్‌ఎస్‌ నేతలు ఆయనను పార్టీలో చేరాలని ఆహ్వానించితే తిరస్కరించారని సమాచారం. తనకు ఏదైనా పదవి ఇవ్వడానికి కూడా సిద్ధమైతే తీసుకోలేదని వారు చెబుతున్నారు.

మరి ప్రభుత్వంలో, పార్టీలో చేరకుండా ఆయనను ఎలా సంప్రదించడం…ఆయన సలహాలు సూచనల ప్రకారం పనిచేయడం మొదలుపెడితే రాజ్యాంగేతర శక్తిగా గుర్తించడం సాధ్యమా? అని కూడా ఈ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎంఎల్‌ పార్టీల రాజకీయాల నుంచి వచ్చిన కోదండరాం టిఆర్‌ఎస్‌లో చేరడం వూహించలేని విషయం. అలా వివిధ పార్టీలలో చేరిన వారు చాలామంది వున్నారు కాని కోదండరాంకు నిజాయితీపరుడని పేరుంది. వామపక్షాలు కోరినప్పుడు కూడా ఆయన ఎంఎల్‌సిగా పోటీ చేసేందుకు ఒప్పుకోలేదు.

వీటన్నిటి నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాలు జెఎసికి దూరం కావాలని తీర్మానం చేశాయని భావించాలి. ఉద్యోగ నేతలు చాలా మంది రకరకాల పదవుల్లో కుదురుకోగా మరికొందరు ఎదురు చూపుల్లో వున్నారు. వారు టిఆర్‌ఎస్‌ రాజకీయ విధానం ప్రకారం వ్యవహరించడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజా ప్రయోజనాలు కాపాడుకోవడానికి జెఎసిని కొనసాగించాలనే కోదండరాం నిర్ణయాన్ని బలపర్చేవారు కూడా చాలా మంది వున్నారు. దానికన్నా ముందు ఆయన బృందం ఏ వైఖరి తీసుకుంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close