పుష్కర మృతులపై న్యాయ విచారణ – అధికారుల సహాయ నిరాకరణ

గోదావరి పుష్కరాలు మొదలైన రోజున జరిగిన తొక్కిసలాటపై న్యాయవిచారణకు అధికారులు సహకరించడం లేదు. కమీషన్ కి సాక్షులు అందజేసిన అఫిడవిట్లపై మార్చి 19 నాటికి వివరణలు ఇవ్వాలని జస్టిస్ సోమయాజులు నెలక్రితమే అదేశించారు. అయితే ఇందుకు మరో రెండు వారాలు గడువు కావాలని అధికారుల తరపు న్యాయవాది రాజమహేంద్రవరంలో విచారణ జరుపుతున్న కమీషన్ ను కోరారు. ఈలోగానే మార్చి 28న విచారణ కమీషన్ గడువు ముగుస్తుంది. కమీషన్ గడువుని పొడిగిస్తేతప్ప ఈ దుర్ఘటనపై విచారణ కొనసాగే అవకాశం లేదు.

గోదావరి పుష్కరాల ప్రారంభోత్సవం రోజున పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 28మంది మరణించారు. దీనిపై న్యాయవిచారణకు రాష్ట్రప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సి వై సోమయాజులు తో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. జస్టిస్ సోమయాజులు కమిషన్ గత ఫిబ్రవరి 23న విచారణ నిర్వహించినపుడే, సాక్షులు దాఖలుచేసిన అఫిడవిట్లపై మార్చి 19లోపు తమ వివరణను దాఖలుచేయాలని ఆదేశించారు.

కమిషన్ ఆదేశాల మేరకు సాక్షులు తమ అఫిడవిట్లను 5లోపు దాఖలుచేశారు.పెద్ద యంత్రాంగం, ప్రత్యేక వ్యవస్థ ఉన్నప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం తమ వివరణను దాఖలుచేయకపోవటం ఆశ్చర్యకరంగా వుంది.

తొక్కిసలాట సంఘటనకు కారకులైన అధికారులే న్యాయవిచారణకు సహకరించటం లేదని, అందువల్ల కమిషన్ ఆదేశాలను నిర్లక్ష్యంచేసిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్ చేసారు. తొక్కిసలాట సంఘటన జరిగినపుడు కీలక బాధ్యతలు నిర్వహించిన అధికారులను బదిలీచేస్తే తప్ప న్యాయవిచారణ ముందుకు సాగదని, మరో 6 నెలలు రాష్ట్ర ప్రభుత్వం గడువు ఇచ్చినాగానీ, ఇదే అధికారులు కొనసాగితే న్యాయవిచారణ కంటి తుడుపు చర్యగానే మిగులుతుందన్నారు.

సిపిఐ నాయకుడు నల్లారామారావు ఏక సభ్య కమిషన్ గడువు పొడిగించాలని కోరారు. సాక్షులు చెప్పిన విషయాలను రాష్ట్రప్రభుత్వానికి తెలియచేయాలని, కమిషన్ గడువు పొడించాల్సిన అవసరాన్ని రాష్ట్రప్రభుత్వానికి వివరించాలని జస్టిస్ సోమయాజులు కమిషన్‌ను నల్లా రామారావు కోరారు. సిపిఎం నాయకుడు టి అరుణ్ మాట్లాడుతూ కమిషన్ గడువు ముగుస్తున్నా ఇంకా రెండు వారాలు గడువు కావాలని కోరటం సరికాదన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

నిరాసక్తంగా జగన్ ప్రచారం – ఆశలు వదిలేసుకున్నట్లే !

ఏపీ సీఎం జగన్ ప్రచారానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రెండు, మూడు రోజులకో సారి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమవుతున్నారు. ప్రచార సభల్ని పరిమితం చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్...

ఒంగోలు లోక్‌సభ రివ్యూ : డబ్బుతొ గెలిచేస్తానని చెవిరెడ్డి లెక్కలు

ఒంగోలు ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. ఆగర్భ శ్రీమంతుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూండగా.. ఎన్నికల అఫిడవిట్‌లోనూ పెద్దగా ఆస్తులు,. ఆదాయం చూపించలేని చెవిరెడ్డి భాస్కర్...

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ను ఓడిస్తే రేవంత్ ను ఓడించినట్లే !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల రాజకీయం రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఆయనను దెబ్బకొట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. సొంత నియోజకవర్గం అయిన మహబూబ్ నగర్ లోక్ సభలో ఓడిస్తే ఆయనకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close