బ‌న్నీ మీద ఆశ‌లు పెట్టుకొంటే…!

సినిమా ప‌రిశ్ర‌మ హిట్ చుట్టూనే తిరుగుతుంటుంది. వ‌రుస హిట్టిచ్చిన ద‌ర్శ‌కుడైనా స‌రే, ఓ ఫ్లాప్ వ‌చ్చిందంటే… అత‌డ్నుంచి ఆమ‌డ దూరం పారిపోతుంటారు. అలాంటిది వ‌రుస‌గా రెండు ఆణిముత్యాల్లాంటి అట్ట‌ర్ ఫ్లాప్‌లు ఇచ్చాడు శ్రీ‌నువైట్ల‌. ఆగ‌డు, బ్రూస్లీ దెబ్బ‌కు శ్రీ‌నువైట్ల అంటేనే నిర్మాత‌లు, హీరోలూ భ‌య‌ప‌డిపోతున్నారు. శ్రీ‌ను పై ఉన్న గౌర‌వంతో కొంత‌మంది హీరోలు క‌థ‌లు విన‌డానికి ఒప్పుకొన్నా… – సినిమా ప‌ట్టాలెక్కించ‌డానికి మ‌రీ మొహ‌మాట ప‌డుతున్నారు. ‘ఇప్పుడు కాదులే సీను… త‌ర‌వాత చూద్దాం’ అంటూ లైట్ తీసుకొంటున్నారు. తాజాగా.. బ‌న్నీ కూడా శ్రీ‌నువైట్ల‌కు అలానే చెప్పాడ‌ట‌.

బ్రూస్లీ త‌ర‌వాత ఓ అర‌డజ‌ను క‌థ‌లు సిద్ధం చేసుకొన్నాడు శ్రీ‌నువైట్ల‌. ఓ ప‌దిమంది హీరోల చుట్టూ తిరిగి ఉంటాడు. బ‌న్నీ కోసం కూడా ఓ క‌థ రెడీ చేసి వినిపించాడు. దూకుడు టైమ్‌లో శ్రీ‌నువైట్ల క్రేజ్ చూసిన బ‌న్నీ.. ‘నీతో ఓ సినిమా చేయాల‌నివుంది’ అని అప్ప‌ట్లోనే చెప్పాడ‌ట‌. అప్పుడు చెప్పాడు క‌దా అని ఇప్పుడు ఓ క‌థ వినిపించ‌డానికి ప్ర‌య‌త్నించాడు శ్రీ‌ను. బ‌న్నీ కూడా మొహ‌మాటం కొద్దీ క‌థ విన్నాడ‌ట‌. కానీ.. బ‌న్నీ నుంచి కూడా అదే మాట‌. ”ఇప్పుడు ఖాళీ లేదు భ‌య్యా.. ఓ రెండేళ్లు ఆగు” అన్నాడ‌ట సింపుల్‌గా! ఇండ్ర‌స్ట్రీలో ‘రేపు చూద్దాం’ అంటేనే అతీ గ‌తీ ఉండ‌దు. రెండేళ్ల వ‌ర‌కూ అదే స్ర్కిప్టు పట్టుకొని శ్రీ‌ను కూర్చుంటాడా..? భ‌లేవాడివి బ‌న్నీ..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close