మీడియా ఇప్పుడు గుర్తొచ్చిందా??

బాహుబ‌లి విజ‌యంలో… మీడియాది కీల‌క పాత్ర‌. రాజ‌మౌళి అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో ఓ సినిమా తీస్తున్నాడ‌ని ముందు నుంచే… డప్పుకొట్టి ఆ సినిమాకి వెన్నుద‌న్నుగా నిలిచాయి ప్ర‌చార మాధ్య‌మాలు. వీలున్న‌ప్పుడ‌ల్లా బాహుబ‌లిపై భారీ క‌థ‌నాలు ప్ర‌చురించాయి. చిత్ర‌బృందం స‌మాచారాన్ని ఏమాత్రం ఇవ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌క‌పోయినా.. ఏదోలా బాహుబ‌లి న్యూస్ క‌వ‌ర్ అయ్యేలా చేశాయి. ఇంట‌ర్వ్యూల‌కు ఇచ్చిన స్పేస్ అయితే లెక్క‌లేదు. సినిమా మొత్తానికి బాహుబ‌లి టీమ్ ఒక్క యాడ్ కూడా ఇవ్వ‌లేదు. అయినా స‌రే ఉచిత ప్ర‌చారాన్ని భుజాల‌పై వేసుకొని… ఈ సినిమాకి లేనిపోని హైప్ క్రియేట్ చేసింది. ఇచ్చిన పాజిటీవ్ రివ్యూలకైతే లెక్కే లేదు. ఇంత చేసినా.. మీడియాని బాహుబ‌లి సంస్థ గుర్తించింది లేదు.

ఇప్పుడు బాహుబ‌లికి జాతీయ అవార్డు వ‌చ్చిన సంద‌ర్భంగా ప‌త్రిక‌లు, టీవీ ఛాన‌ళ్లు, వెబ్ మీడియా.. ఆ విష‌యాన్ని హైలెట్ చేస్తూ బాహుబ‌లి ఘ‌న‌త‌ను మ‌రోసారి వేనోళ్ల కొనియాడింది. ఇప్పుడు తీరిగ్గా.. బాహుబ‌లి నిర్మాత‌లు మీడియాకు కృత‌జ్ఞ‌త‌లు…అంటూ ఓ పత్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాయి. మీడియా ఎంతో చేసిందని, చిన్న చిన్న లోటు పాట్లు ఉన్నా స‌ర్దుకొని బాహుబ‌లి విజయంలో కీల‌క పాత్ర పోషించింద‌ని ఓ ప్ర‌క‌ట‌న పంపారు. మీడియా బాహుబ‌లికి ఏం చేసిందో, ఎంత చేసిందో ఆ నిర్మాత‌ల‌కు ఇప్పుడు గుర్తొచ్చిందా..?? జాతీయ ప‌త్రిక‌ల్ని సెట్స్‌కి పిలిపించుకొని… అక్క‌డి విశేషాల్ని ముందే వాళ్ల‌కు లీక్ చేసిన బాహుబ‌లి టీమ్‌కి.. ఇక్క‌డి మీడియా గుర్తు లేనే లేదు. అస‌లు తెలుగు మీడియా గురించి రాజ‌మౌళి టీమ్ లైట్ తీసుకొంది. సినిమా విడుద‌లై.. భారీ విజ‌యాన్ని, రికార్డు వ‌సూళ్ల‌నీ అందుకొన్న‌ప్పుడు కూడా.. మీడియాకు థ్యాంక్స్ అన్న ఒక్క మాట‌
చెప్పిన పాపాన పోలేదు. ఇప్పుడు… మాత్రం మీడియాకు థ్యాంక్స్ లెట‌ర్ పంపారు! బాహుబ‌లి 2 వ‌స్తోంది క‌దా.. ఈసారీ అంతే భారీ ఎత్తున ప్ర‌చారం చేయ‌మ‌ని చెప్ప‌డానికి థ్యాంక్స్ అన్న ప‌దాన్ని వాడుకొన్నారేమో? ఏదేమైనా ప్ర‌చారం రాబ‌ట్టుకొనే విష‌యంలో బాహుబ‌లి టీమ్ ఆరితేరిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close