మాటల్లో చురుకుదనం, చేతల్లో అలసత్వం: ఇదీ టి సర్కారు తీరు

అరవై ఏళ్ల కల నెరవేరింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఉద్యమించిన పార్టీకే అధికారం వచ్చింది. అలాంటప్పుడు ఎలా ఉండాలి. ప్రతి క్షణం, ప్రతి అడుగు వడివడిగా అభివృద్ధి వైపు సాగిపోవాలి. తమకు వచ్చే ప్రతి పైసానూ సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు వీలైనంత మేలు చేయాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం కొన్ని విషయాల్లో నత్తను తలపిస్తోంది. కేసీఆర్ భారీ పథకాలు, వేలకోట్లని పెద్ద పెద్ద మాటలు చెప్తారు. కానీ చిన్న చిన్న విషయాల్లో ప్రభుత్వ అలసత్వం వల్ల తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ నిధులను నష్టపోయే ప్రమాదం ఉంది.

రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ అనే పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఉన్నత విద్యాభివృద్ధి కోసం ఉద్దేశించిన పథకమిది. ప్రతి యూనివర్సిటీకి 25కోట్లు ఇస్తారు. విద్యార్థులకు మేలు చేసే పథకం. దీనికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన, నియామకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. మరో వైపు ఏపీ ప్రభుత్వం 120 కోట్ల రూపాయలను తెచ్చుకుంది. ఈ ప్రాజెక్టు డైరెక్టరేట్ ను ఏర్పాటు చేయడానికే కేంద్రం 2 కోట్లు ఇస్తుంది. కానీ ఈ నియామకాన్ని ఇంకా ప్రకటించలేదు. ఏపీ ఈ పని ఎప్పుడో చేసింది. 2 కోట్లను సొంతం చేసుకుంది.

నాక్ బి గ్రేడ్ ఉన్న యూనివర్సిటీలకు కేంద్రం నుంచి నిధులు పొందడానికి కావాల్సిన కసరత్తు ఇంకా జరగలేదు. ఇందుకోసం తగిన సిబ్బందిని నియమించాలి. అది జరగలేదు. యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచడం, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా బోధనకు వసతులు సమకూర్చడానికి ఈ నిధులను కేంద్రం ఇస్తుంది. ఏపీ ప్రభుత్వం తన రాష్ట్రంలోని 59 నాక్ బి గ్రేడ్ గుర్తింపు గల కాలేజీలకు 118 కోట్ల రూపాయల కేంద్ర నిధులను పొందింది. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కోసం ఆ నిధులను ఖర్చు పెడుతోంది. తెలంగాణలో అతీ గతీ లేదు.

ఈ పథకం కింద నిధులను పొందడానికి మార్చి వరకూ గడువుంది. నిజమే. కానీ అతి నిదానం వల్ల తాబేలు, కుందేలు కథలా మారే ప్రమాదముంది. అయినా, నోడల్ అధికారిని, సిబ్బందిని నియమించి ప్రతిపాదనలు తయారు చేయించి పంపడం అతి కష్టమైన పనేమీ కాదు. ప్రతిదానికీ ఏపీ కంటే మేమే గొప్ప అని చెప్పుకొనే తెలంగాణ సర్కారు, ఈ విషయంలో మాత్రం బాగా వెనకబడి పోయింది. సత్వరం కేంద్ర ప్రభుత్వ నిధులను తెచ్చుకుని, విద్యార్థులకు మెరుగైన సదుపాయాలను కల్పిస్తే తప్పేంది?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close