కాశ్మీర్లో జాతీయ పతాకం పట్టుకోవడం నేరమా?

శ్రీనగర్ ఎన్.ఐ.టి. వివాదంలో అనేక అనూహ్య విషయాలు వెలుగుతోకి వస్తున్నాయి. తరచూ పాకిస్తాన్, ఐసిస్ జెండాలతో వీధుల్లోకి వచ్చి వీరవిహారం చేసే ముష్కరమూకను పోలీసులు ఏమీ అనరు. వాళ్లకు చాలా దూరంలో నిలబడి, సుతారంగా సుతిమెత్తగా భాష్పవాయువు ప్రయోగిస్తారు. అంతే, ఇక చోద్యం చూస్తూ ఉంటారు. జాతి వ్యతిరేక శక్తులు రాళ్లు రువ్వుతున్నా సంయమనం పాటిస్తారు. చేతిలోన తుపాకులు, లాఠీలను ఉపయోగించాలనే ఆలోచనే వాళ్లకు రాదు.

శ్రీనగర్ నాన్ లోకల్ విద్యార్థులు రక్షణ కల్పించాలంటూ జాతీయ పతాకంతో మౌన ప్రదర్శన చేశారు. కాశ్మీర్లో ఎప్పుడూ పాక్ జెండాలతో ప్రదర్శన చూసిన పోలీసులకు, త్రివర్ణ పతాకం కొత్తగా కనిపించిందేమో. బహుశా ఇదే విదేశీ జెండా అనుకున్నారో. విద్యార్థులపై విరుచుకుపడ్డారు. రక్షణ కోరిన వాళ్లను రాక్షసంగా కొట్టారు. తలలు పగిలేలా లాఠీచార్జి చేశారు. ఇంతా చేసి వాళ్లు చేసిన తప్పేంటి? జాతి వ్యతిరేక చర్యలను అడ్డుకోవడం. అది కూడా కాశ్మీర్లో నేరమేనా?

టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో వెస్టిండీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. క్యాంపస్ లోని కొందరు స్థానికు కాశ్మీరీ యువకులు పండుగ చేసుకున్నారు. పటాకులు కాల్చారు. సంబరాలు జరుపుకున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన యువకులు దీన్ని అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ తలెత్తింది. అప్పటి నుంచీ లోకల్ విద్యార్థుల ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. చివరకు, స్థానికేతర మహిళా విద్యార్థులను రేప్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. దీంతో తమకు రక్షణ కల్పించాలని క్యాంపస్ లో ప్రదర్శన చేసిన వాళ్లను గొడ్డును బాదినట్టు బాదారు కాశ్మీరీ పోలీసులు.

కాశ్మీరీ పోలీసులు అంతటిలో ఆగలేదు. వాళ్లు విద్యార్థుల దగ్గరున్న జాతీయ పతాకాన్ని గుంజుకున్నారు. ఇంత జరిగినా ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కిమ్మనడం లేదు. వేర్పాటు వాదులకు అనుకూల పార్టీగా పీడీపీకి పేరుంది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేర్పాటు వాదులు ఆడింది ఆటగా మారింది. దానితో జతకట్టిన బీజేపీ మాత్రం చేతులు ముడుచుకుని కూర్చుంది. కాశ్మీర్లో అధికారంలో ఉన్నాం అనిపించుకోవడం కోసం అన్నీ వదిలేసిందనే అపఖ్యాతి మూటగట్టుకుంది. ఎన్ ఐ టి లో ఇన్ని అరాచకాలు జరుగుతున్నా బీజేపీకి చెందిన ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులకు చీమకుట్టినట్టయినా లేదు. అధికార మత్తులో జోగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు పాంథర్స్ పార్టీ నిరసన ప్రదర్శనలు చేస్తోంది. బంద్ కు పిలుపునిచ్చింది. బీజేపీ పదవీ వ్యామోహంలో పడి జాతి వ్యతిరేక శక్తుల పట్ల మెతక వైఖరి అవలంబిస్తోందనే విమర్శకు ప్రధాని మోడీ ఏం జవాబ చెప్తారో మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close