తాగునీళ్ళ రైళ్ళు – లాతుర్ ఒక హెచ్చరిక!

నాలుగున్నర లక్షలమందికి తలకు 12 లీటర్ల నీటిని అందజేయడానికి రెండు రైళ్ళు 1200 కిలోమీటర్ల ప్రయాణాన్ని ప్రారంభించాయి. మహారాష్ట్రలోని లాతూర్ లో నీళ్ళకోసం హింసాత్మక సంఘటనలు పెరిగిపోతూండటంతో 144 సెక్షన్ విధించారు. తక్షణ సహాయక చర్యగా రాజస్ధాన్ నుంచి నీళ్ళ రైళ్ళు బయలుదేరాయి.

మరట్వాడా ప్రాంతంలోని లాతూరుతో సహా అదేరాష్ట్రంలో బుందేల్ ఖండ్, విదర్భ ప్రాంతాల్లో కూడా తీవ్రమైన నీటిఎద్దడిని స్వయంగా పరధానమంత్రి నరేంద్రమోదీ సమీక్షించారు. ఫలితంగానే 54 వేల లీటర్ల చొప్పున పట్టే 50 వ్యాగన్లతో రెండు రైళ్ళు రాజస్ధాన్ నుంచి లాతూరు ప్రయాణమయ్యాయి.

గత కొన్నేళ్లుగా వర్షాలు లేక మరఠ్వాడాలోని జలాశయాలు ఎండిపోయి దుర్భర కరువు పరిస్థితి నెలకొంది. గత రెండు నెలలుగా చాలామంది రైతులు, పేదలు ఊళ్లు వదలి బతుకు తెరువుకోసం ముంబై చేరుకున్నారు. కూలీ పని చేసుకుంటూ కుటుంబాలను సాకుతున్నారు. మరాఠ్వాడాలో కరువు కారణంగా గత ఏడాది 3 వేల 228 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

లాతూర్‌తో పాటు పరిసర గ్రామాలకు నీటిని సప్లయ్‌ చేసే డామ్‌ పూర్తిగా అడుగంటిపోయింది. దీంతో ఇక బావులు, బోరు బావులే జనానికి దిక్కయ్యాయి. ఆ బావుల నుంచి జనానికి సరిపడా నీళ్లు సప్లయ్‌ కావడం లేదు. తాగునీరు కూడా లేని దుర్భిక్షం తీవ్రత ఇది.

ప్రభుత్వాలే వ్యవసాయ అభివృద్ధి క్రతువు మొదలు పెట్టాక, ఒక వానఇచ్చిన తేమతోనే విగగకాసిన ఆరుతడి జొన్న ఎన్నినీళ్ళైనా చాలని వరి ముందు ఓడిపోయింది. ప్రాజెక్టుల ముందు చెరువులు మాయమైపోయాయి. బోర్లు వచ్చాక నేలమీద నీరే కనిపించకుండా పోయింది. దాహంతీరని వంగడాలు నేలను పిప్పిగా మార్చేస్తున్నాయి. పురుగుమందులు, రసాయన ఎరువులు భూమిని మందు పాతరగా మార్చేస్తున్నాయి.

ఇన్ని కారకాలను సృష్టించిన ”అభివృద్ధి” వెనుకే భూమిలోంచి ప్రళయం ఉబికి వస్తూంది. అది ఇదే లాతూరులో భూకంపమై మొదటిసారి హెచ్చరించింది. పల్లెను చల్లగా తాకిన వాగునీ, నేలను పచ్చగా వుంచిన పిల్లకాలువనీ, మనిషికీ, పశువుకీ తిండిపెట్టిన చెరువునీ మాయం చేసుకుంటున్న మానవాళికి రెండో హెచ్చరికలా అదే లాతూరులో తాగునీళ్ళే లేకుండా పోయిన శాపం దాపురించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అధికారం కోల్పోయినా సరే కానీ… జగన్ టార్గెట్ అదే..!?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం మరో మూడు రోజుల్లో ముగియనుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు ఎప్పటికప్పుడు పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలను మార్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో పవన్ ఓటమి లక్ష్యంగా వైసీపీ...

వెట‌ర‌న్‌ల‌కు వెండి తెర స్వాగ‌తం

క్రికెట్‌లో వెట‌రన్ అనే మాట ఎక్కువ‌గా వాడుతుంటారు. ఆటగాడిగా రిటైర్ అయిపోయిన త‌ర‌వాత‌.. వాళ్లంతా వ్య‌క్తిగ‌త జీవితాల‌కు ప‌రిమితం అయ్యేవారు. ఇప్పుడు ఐపీఎల్ వ‌చ్చింది. దాంతో రిటైర్ ఆట‌గాళ్లంతా కోచ్‌లుగా, మెంట‌ర్లుగా మారుతున్నారు....

అందర్నీ గొడ్డలితో నరికేసి సింగిల్ ప్లేయర్ అవ్వండి – భారతికి షర్మిల సలహా

వైఎస్ జగన్, ఆయన సతీమణిపై వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బధవారం మీడియాతో మాట్లాడిన షర్మిల వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి... వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ...

విజ‌య్ సినిమాల‌కు టైటిళ్లు కావ‌లెను!

రేపు.. అంటే మే 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా విజయ్ కొత్త సినిమాల సంగ‌తులు రేపే రివీల్ కాబోతున్నాయి. మైత్రీ మూవీస్ లో విజ‌య్ ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close