డిస్ట్రిబ్యూటర్స్ పై పోలీస్ కేస్ పెట్టిన పూరి జగన్

చేతిలో హిట్స్ ఉన్నంత వ‌ర‌కూ ద‌ర్శ‌కుడే హీరో ! ఒక్క‌సారిగా ఫ్లాపులు చుట్టుముడితే అప్ప‌టి వ‌ర‌కూ చుట్టూ ఉండి భ‌జ‌న చేసిన వాళ్లంతా విల‌న్‌ని చూసిన‌ట్టు చూస్తుంటారు. ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ప‌రిస్థితి ఇలానే ఉంది. జ్యోతిల‌క్ష్మి, లోఫ‌ర్ సినిమాల‌తో రెండు వ‌రుస డిజాస్ట‌ర్లు ఎదుర‌వ్వ‌డంతో పూరి పై న‌మ్మ‌కంతో సినిమాలు కొన్న డిస్టిబ్యూట‌ర్లు పూరిపై కోపం తెచ్చుకొన్నారు. పూరి వ‌ల్ల త‌మ కుటుంబాలు నాశ‌న‌మ‌య్యాయ‌ని గోల గోల చేస్తున్నారు. ఇదే విష‌యంపై పూరిని కొంతమంది బ‌య్య‌ర్లు మాటి మాటికీ నిల‌దీస్తున్నార్ట‌. వ‌రుస ఫ్లాపుల వ‌ల్ల న‌ష్ట‌పోయామ‌ని. ఆదుకోవాల్సిన బాధ్య‌త నీదే అంటూ పూరిని ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌డం లేద‌ని తెలుస్తోంది.

త‌దుప‌రి సినిమాల్ని త‌మ‌కే త‌క్కువ రేటు కి అమ్మాల‌ని హెచ్చ‌రిస్తున్నార‌ట‌. ఈ వ్య‌వ‌హారంపై విసిగిపోయిన పూరి జ‌గ‌న్నాథ్ ఇప్పుడు పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాడు. శ‌నివారం సాయింత్రం బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌కి వ‌చ్చిన పూరి కొంత‌మంది బ‌య్య‌ర్ల‌పై లిఖిత పూర్వ‌క‌మైన ఫిర్యాదు చేసిన‌ట్టు తెలుస్తోంది. పోలీసులు కూడా సానుకూలంగా స్పందించార‌ట‌. పూరిని ఎవ‌రెవ‌రు బెదిరించారో ఆ లిస్టు తీసుకొని, ఆ బ‌య్య‌ర్ల‌ని పిలిపించి మాట్లాడ‌తామ‌ని హామీ ఇచ్చార‌ట‌. ఏ విష‌య‌మైనా సానుకూలంగా కూర్చుని చ‌ర్చించుకొంటే మంచిది. బ‌య్య‌ర్ల‌యినా, ద‌ర్శ‌కులైనా రోడ్డెక్కితే సున్నిత‌మైన విష‌యం కాస్త కాంప్లికేటెడ్ వ్య‌వ‌హారంలా త‌యార‌వుతుంది. మ‌రి ఈ గొడ‌వ ఎంత వ‌ర‌కూ వెళ్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close