తెలకపల్లి వ్యూస్ : మళ్లీ కెసిఆర్‌ ఆరోగ్య చర్చ!

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారనే కథనాలు మొదట్లో బాగా వినిపించేవి. కుమారుడు కెటిఆర్‌ ఆందుకోసమే సింగపూర్‌కు వెళ్లివచ్చారని కూడా చెబుతుండేవారు. తెలుగుదేశం నాయకుల నుంచి వచ్చే ఈ కబుర్లు పెద్దగా పట్టించకోనవసరం లేదని టిఆర్‌ఎస్‌ నాయకులు చెప్పడమే గాక పరిశీలకులు కూడా తోసిపారేసేవారు. కెటిఆర్‌ కవిత మీడియాలో మాట్లాడినప్పుడు కూడా ఆ వార్తలను ఖండిస్తూ వచ్చారు. ఆయన ఆరోగ్యం లక్షణంగా వుందని నొక్కి చెప్పేవారు. అయితే కెసిఆర్‌ మాత్రం అప్పటికి నేను బతికుంటే .. అంటూ మాట్లాడేవారు. పెద్దవాళ్లు యథాలాపంగా అనేమాట తప్ప దానికి పెద్ద ప్రాధాన్యత నివ్వొద్దని కెటిఆర్‌ స్పష్టం చేసేవారు. అయితే శాసనసభలో ఎక్కువ సేపు కూచున్నప్పుడు ముఖ్యమంత్రి అలసి పోవడమే గాక వాపులు కూడా కనిపిస్తున్నాయని ఒక ప్రముఖ పార్టీ శాసనసభా నాయకుడు తన పరిశీలన చెప్పారు.

ఇంతలోనే టిఆర్‌ఎస్‌ ద్వితీయ శ్రేణి నాయకుడు అయితే కెసిఆర్‌కు బాగా సన్నిహితుడూ అయిన ఒక ఒక మిత్రుడు మొదటిసారి  కేసిఆర్ ఆరోగ్యసమస్యలు బాగానే వున్నాయన్నట్టు మాట్లాడారు. ఆయన స్వభావాన్ని బట్టి చూస్తే అధిష్టానం ఆమోదం లేకుండా పెదవి విప్పే రకం కాదు. అంతకు ముందు టిన్యూస్‌లో సుదీర్ఘంగా పాల్గొన్నప్పుడు కూడా కెసిఆర్‌ ‘బతికి వుంటే చూస్తాను’ అంటూ వ్యాఖ్యానించారు.

ఇప్పుడు ఆయనకు జ్వరం మూడు రోజుల విశ్రాంతి వార్తలపై సోషల్‌ మీడియాలో అనేక వ్యాఖ్యానాలు తిరుగాడుతున్నాయి. గతంలో వలె పూర్తిగా ఖండించడం గాక ఎంతో కొంత సమస్య వుందని భావించడానికి ఇవన్నీ కారణమవుతున్నాయి. లేక వారసత్వ ప్రక్రియ త్వరితంగా పూర్తి చేయడానికి ఇదంతా జరుగుతున్నదా అనే సందేహం కూడా ప్రతికూల శిబిరంలో వుంది. కెసిఆర్‌ ఆరోగ్యంగా వున్నారని విశ్వసిస్తూనే వుండాలని ఆశిస్తూనే ఈ గందరగోళాన్ని తొలగిస్తారని ఆశిద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close