ఔను.. అక్క‌డికి తాగి వెళ్లా!

ఒక‌ప్పుడు క‌మెడియ‌న్ కృష్ణ‌భ‌గ‌వాన్ లేకుండా సినిమానే ఉండేది కాదు. హీరో ప‌క్క‌నో, విల‌న్ చెంత‌నో నిల‌బ‌డి సెటైర్లు మీద సెటైర్లు వేసేవాడు. ఈమ‌ధ్య మాత్రం కృష్ణభ‌గ‌వాన్‌ని వెదుక్కోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. సినిమాల్లేవు. వ‌చ్చినా ఇది వ‌ర‌క‌టిలా పంచ్‌లు పేల‌డం లేదు. దానికి తోడు వ్య‌క్తిగ‌త ప్ర‌వ‌ర్త‌న కూడా త‌న కెరీర్‌ని పాతాళంలోకి తీసుకెళ్లిపోయింది. ఈ క‌మెడియ‌న్ తాగుడుకి బానిసైపోయాడ‌ని, అది ఆరోగ్యంపై ప్ర‌భావం చూపించ‌ద‌ని, అందుకే అవ‌కాశాలూ దూర‌మయ్యాన‌ని చెప్పుకొంటున్నారు. ఆమ‌ధ్య ఓ కాలేజీ ఫంక్ష‌న్‌కి తాగి వెళ్లి.. వేదిక‌పై ఏదోదో వాగి మ‌రింత అభాసుపాలయ్యాడు. ఆ ఎపిసోడ్ కృష్ణ‌భ‌గ‌వాన్ కూడా గుర్తు చేసుకొన్నాడిప్పుడు.

”అవును.. ఆ కాలేజీ ఫంక్ష‌న్‌కి నేను తాగి వెళ్లా. కానీ.. అలా వెళ్లింది అదొక్క‌సారే. ఆ పొర‌పాటు మ‌రోసారి జ‌ర‌గ‌నివ్వ‌ను. నా ఆరోగ్యం ప్ర‌స్తుతం బాగానే ఉంది. త్వ‌ర‌లోనే మునిప‌టిలా సినిమాల్లో మెరుస్తాన‌న్న న‌మ్మ‌కం ఉంది” అంటున్నాడు. అయితే కుర్ర క‌మెడియ‌న్ల జోరు, జ‌బ‌ర్ ద‌స్త్ గ్యాంగ్ ముందు కృష్ణ‌భ‌గ‌వాన్ నిల‌బ‌డ‌తాడా అన్న‌ది సందేహ‌మే. మునుప‌టిలా పంచ్‌లో జోరు చూపించాలంటే… అలాంటి మంచి పాత్ర‌లు ప‌డాలి. వాటికోస‌మే కృష్ణ‌భ‌గ‌వాన్ వెయిటింగ్ చేస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

అలీ ఎక్క‌డ‌.. క‌నిపించ‌డే?

టీడీపీ, జ‌న‌సేన నుంచి సీటు ఆశించి భంగ‌ప‌డి, వైకాపా గూటికి చేరిన‌వాళ్ల‌లో అలీ ఒక‌డు. కేవ‌లం వైకాపా త‌న‌కు సీటు ఇస్తుంద‌న్న కార‌ణంతోనే స్నేహితుడైన ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని కూడా దూషించే సాహ‌సానికి ఒడిగ‌ట్టాడు...

ఘరానా మోసం… బ్రతికున్నా చంపేస్తున్నారు..!!

హైదరాబాద్ చుట్టుప్రక్కల మీ పేరిట ప్లాట్ ఉందా..? డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయని తీరిగ్గా ఉన్నారా..? అయినా ప్లాట్ల విషయంలో ప్రమాదం పొంచి ఉందండోయ్. నకిలీ ఆధార్ , నకిలీ ధృవీకరణపత్రాలు, నకిలీ ఓనర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close