మిషన్ కాకతీయ… రూ. 20 వేల కోట్లు వృథానా?

తెలంగాణలో చెరువులకు పూర్వ వైభవం తేవడానికి తెరాస ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ విజయవంతం అయ్యే అవకాశం లేదట. జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్.జి.ఆర్.ఐ.) శాస్త్రవేత్తలు సాధికారికంగా తెలిపిన వాస్తవమిది. 20 వేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో 46 వేలకు పైగా చెరువుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. జోరుగా పనులు చేపట్టింది. అయితే శాస్త్రీయ పద్ధతిలో కాకుండా పైపైన పనులుచేయడం వల్ల ఉపయోగం లేదని ఎన్ జి ఆర్ ఐ శాస్త్రవేత్తలు ఓ నివేదికలో స్పష్టం చేశారు. అదే నిజమైతే, 20 వేల కోట్లూ బూడిదలో పోసిన పన్నీరేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాలోని అనేక ప్రాంతాలు గట్టి రాతి ప్రాంతాలు. అక్కడ చెరువులను తవ్వడం లేదా పునరుద్ధరించడం అనేది శాస్త్రీయ పద్ధతిలో జరగాలని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అక్కడ నీటి లభ్యత ఇతర అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని తెలిపారు. కానీ మిషన్ కాకతీయలో అది జరగలేదు. ఏదో తోచిన విధంగా తవ్వకాలు జరిపారుని, వీటి వల్ల నీరు నిల్వ చేసే అవకాశాలు పెద్దగా ఉండవని తేల్చారు.

ఒకప్పుడు కాకతీయ రాజులు గొలుసుకట్టు చెరువులు తవ్వించారు. ఆ విధానాన్ని చూసి ప్రపంచం నివ్వెరపోయింది. బ్రిటిష్ ప్రభుత్వంలోని ఎంతో మంది నిపుణులు కూడా విస్తుపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెరువుల పునరుద్ధరణ టాప్ ప్రయారిటీగా చేపట్టారు. దీనికి మిషన్ కాకతీయ అని పేరుపెట్టారు.

ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పినదాన్ని బట్టి చూస్తే, వరంగల్ జిల్లాకు ఇతర జిల్లాలకు భౌగోళికంగా తేడా ఉంది. కాకతీయులు గొలుసుకట్టు చెరువులు కట్టించిన ప్రాంతాల్లోని పరిస్థితులు వేరు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రాంతాల భూభౌతిక స్థితిగతులు వేరు. కాబట్టి దీనికి అనుగుణంగా శాస్త్రీయమైన పద్ధతిలో పనులు చేయించాల్సింది. కానీ అలా జరగక పోవడం వల్ల 20 వేల కోట్ల రూపాయల పనులతో పెద్దగా ప్రయోజనం లేకపోతే అది బాధాకరమే. ప్రభుత్వం ముందే తగిన శాస్త్రీయమైన సూచనలు తీసుకుని పనులు మొదలుపెడితే బాగుండేది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

సీరం ఇన్‌స్టిట్యూట్ బీజేపీకి 50 కోట్ల విరాళం ఇచ్చిందా…కారణం ఇదేనా..?

కోవిషీల్ద్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా...

బేలగా మోదీ ప్రచారం – ఏం జరుగుతోంది ?

నరేంద్రమోడీ ఎప్పుడైనా దూకుడుగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చ అని కార్యక్రమం పెట్టి అందర్నీ ఆకట్టుకుంటారు. ఇటీవల తనను...

అబద్దాల ప్రభుత్వం – అమల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రెస్ మీట్ పెట్టి అదే చెబుతున్నారు. కోర్టుల్లో తీర్పులు వచ్చిన తర్వాతనే అమలు చేస్తామని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close