బన్నీ గేమ్ ప్లాన్ మారింది

స‌రైనోడు బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఊహించిన‌ట్టుగానే దూసుకుపోతున్నాడు. రేసుగుర్రం రికార్డుల్ని బ‌ద్ద‌లుకొట్టే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ నిపుణులు లెక్క‌లుగ‌డుతున్నారు. ఈ విజ‌యం ఇచ్చిన కిక్‌లోనే మ‌రుస‌టి సినిమా కూడా మొద‌లెట్టేద్దాం అనుకొంటున్నాడు బ‌న్నీ. స‌రైనోడు త‌ర‌వాత విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శక‌త్వంలో బ‌న్నీ ఓ సినిమా చేయాల్సివుంది. 24 సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌నుల్లో బిజీగా ఉన్నాడు విక్ర‌మ్ కుమార్‌. ఆ త‌ర‌వాత బ‌న్నీ సినిమాని టేక‌ప్ చేస్తాడ‌నుకొన‌న్ఆరు. అయితే.. ఇప్పుడు బ‌న్నీ గేమ్ ప్లాన్ మారిన‌ట్టు తెలుస్తోంది. విక్ర‌మ్ సినిమాని ప‌క్క‌నెట్టి, మ‌రో సినిమాని మొద‌లెట్టే ఆలోచ‌న‌లో ఉన్నాడు బ‌న్నీ.

విక్ర‌మ్ కె.కుమార్‌ది కాస్త విల‌క్ష‌ణ‌మైన శైలి. సాధార‌ణంగా ఓ సినిమా అయిపోయిన వెంట‌నే మరో సినిమా ప‌నిలో ప‌డిపోవ‌డం విక్ర‌మ్ కు అల‌వాటు లేదు. క‌థ‌పై బాగా క‌స‌ర‌త్తు చేసి, స్ర్కిప్ట్‌పై పూర్తిగా ప‌ట్టు సాధించిన త‌ర‌వాతే సినిమాని ప‌ట్టాలెక్కిస్తాడు. బ‌న్నీ క‌థ కోసం విక్ర‌మ్ మ‌రింత స‌మ‌యం కావాల‌ని చెప్పాడ‌ట‌. న‌వంబ‌రులోగానీ సినిమా మొద‌లెట్టే అవ‌కాశాలు లేవ‌ని స్ప‌ష్టం చేశాడ‌ట‌. ఈలోగా ఖాళీగా ఉండ‌డం ఎందుకు అని మ‌రో సినిమా మొద‌లెడ‌దామ‌నుకొంటున్నాడు బ‌న్నీ. నాలుగు నెల‌ల్లో పూర్త‌య్యే స్ర్కిప్టు కోసం బ‌న్నీ ఎదురుచూస్తున్నాడ‌ని టాక్‌. యువ ద‌ర్శ‌కుల‌కు బ‌న్నీ అవ‌కాశం ఇవ్వొచ్చ‌ని, అందుకోసం క‌థ‌లూ వింటున్నాడ‌ని తెలుస్తోంది. మ‌రి.. బ‌న్నీ ఎవ‌రి క‌థ‌కు ఓకే చెప్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close