శిరీష్ సినిమా… మ‌రో మ‌గ‌ధీర‌

టైటిల్ కామెడీగానే ఉన్నా.. అల్లు శిరీష్ కొత్త సినిమా క‌థ‌.. ఆ లెవిల్లో ఉంద‌ట‌. అల్లు శిరీష్ ఈరోజే ఓ కొత్త సినిమాకి శ్రీ‌కారం చుట్టాడు. ఎం.వి.ఎన్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ద‌ర్శ‌కుడూ శిరీష్ క్లోజ్ ఫ్రెండ్స‌ట‌. అందుకే ఈ కాంబో సెట్ట‌యిపోయింద‌ని అల్లు శిరీషే చెబుతున్నాడు. అన్న‌ట్టు ఈ సినిమా క‌థ గురించి ఓ క్లూ కూడా ఇచ్చాడు. ఫ్లాష్ బ్యాక్‌లో 700 సంవ‌త్స‌రాల క్రితం స‌న్నివేశాల్ని చూపిస్తార‌ట‌. మ‌గ‌ధీర‌లో కూడా ఇంతేగా.. అదో పున‌ర్జ‌న్మ నేప‌థ్యంలో సాగే క‌థ‌. చూస్తుంటే శిరీష్ కూడా పున‌ర్జ‌న్మ కాన్సెప్టుని న‌మ్ముకొన్న‌ట్టు క‌నిపిస్తోంది.

గౌర‌వంతో పోలిస్తే.. కొత్త‌జంట‌లో కాస్త బెట‌ర్ అనిపించాడు శిరీష్‌. కాక‌పోతే హీరోకుండాల్సిన ల‌క్ష‌ణాల్ని మాత్రం సంపాదించుకోలేక‌పోయాడు. ఇప్పుడు శ్రీ‌ర‌స్తు – శుభ‌మ‌స్తులో న‌టిస్తున్నాడు. ఆసినిమాలో శిరీష్ న‌ట‌న బాగా బెట‌ర‌య్యింద‌ని టాక్‌. ఆ న‌మ్మ‌కంతోనే… ఇప్పుడు ప్రాజెక్టులు వ‌స్తున్నాయట‌. బ‌న్నీ ఎలాగూ స్టార్ అయిపోయాడు.. ఇక శిరీష్‌నీ సినిమా ప‌రిశ్ర‌మ‌కు అంకితం చేసేద్దాం అన్న స్థాయిలో అల్లు అర‌వింద్ కూడా కాస్త గ‌ట్టిగానే ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు. మ‌రి ఈసారి ఏం అవుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close