తెదేపా వైకాపాలను గిల్లుతున్న పొంగులేటి!

పాలేరు ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఎడాపెడా దూకుడు నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. రాంరెడ్డి వెంకటరరెడ్డి మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో ఉప ఎన్నికకు ఆయన భార్యనే మోహరించిన కాంగ్రెస్‌ ఏకగ్రీవం చేసుకోవడంలో విఫలం అయినప్పటికీ కొన్ని పార్టీల మద్దతును మాత్రం కూడగట్టగలిగింది. అయితే.. ఆ పార్టీలతో కూడా గిల్లికజ్జాలు పెట్టుకునేలా.. వారిని రెచ్చగొట్టేలా ఆ పార్టీ నాయకులు ఇప్పుడు మాట్లాడుతూ ఉండడం విశేషం. కాంగ్రెస్‌ నాయకులు ఏ ఉద్దేశంతో స్టేట్‌మెంట్లు ఇస్తున్నారో గానీ.. అది వారికే చేటు తెస్తుందని పలువురు అంటున్నారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిన్న కోపం వచ్చింది. కాంగ్రెస్‌ సీఎల్పీ సమావేశానికి రమ్మని పిలిచి, వచ్చిన తర్వాత.. కేవలం ఎమ్మెల్యేలకు మాత్రమే అంటూ తనని అవమానింంచారని ఆయన అలిగారు. ఆ వేడి కూడా జత కలిసిందో ఏమో గానీ.. ఆయన పాలేరు ఉప ఎన్నికల్లో తెదేపా, వైకాపా సహకరించడం గురించి తీవ్రంగా వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలకు తెరాస ముందే గండి కొట్టింది. ఉత్తం కుమార్‌రెడ్డి కేసీఆర్‌ను కలవడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. కేసీఆర్‌ కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకుండా, తమ అభ్యర్థిని ప్రకటించేశారు. కనీసం మిగిలిన వారి మద్దతు కూడగట్టుకోవాలని ఆ పార్టీ సంకల్పించింది. అతి ప్రయత్నమ్మీద తెదేపా, వైకాపాలు పోటీచేయకుండా, వారి మద్దతు తమ అభ్యర్థికి దక్కేలా వారి సానుకూలతను సాధించింది. అయితే కనీసం సీపీఎం మద్దతు కూడా రాబట్టుకోలేకపోయింది. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు సీపీఎంతో మైత్రి ఉన్నా.. ఇక్కడ వారి మద్దతును పొందలేకపోయారు. సీతారాం యేచూరి ద్వారా చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు.

ఏదో తెదేపా, వైకాపా మద్దతు ఇస్తే… ఇప్పుడు వారిని రెచ్చగొట్టేలా పొంగులేటి సుధాకరరెడ్డి మాట్లాడడం విశేషం. ఆ రెండు పార్టీలు కేవలం ంప్రకటనలకు పరిమితమైతేచాలదని, కాంగ్రెస్‌ అభ్యర్థి విజయానికి వారంతా కష్టపడి పనిచేయాలని ఆయన హితవు చెబుతున్నారు. ఇది మరీ చోద్యమైన విషయం. పొంగులేటి అంటున్న ప్రకారం.. తెదేపా వారంతా పాలేరులో కాంగ్రెస్‌ జెండాలు ఎత్తుకుని హస్తం గుర్తుకే మీ ఓటు అంటూ తిరగాలన్నమాట. మద్దతు ఇవ్వని వారి విషయంలో వీరేమీ చేయలేకపోయారు గానీ, మద్దతు ఇస్తున్న వారితో కూడా గిల్లికజ్జాలు పెట్టుకునేలా ఈ మాటలు ఉంటున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close