ఈసారి రెండే ఫైట్లట‌

బోయ‌పాటి శ్రీ‌ను మీద ఓ ముద్ర ప‌డిపోయింది.యాక్ష‌న్ సినిమాల్నీ డోసు పెంచి తీసే ద‌ర్శ‌కుడ‌ని పేర‌డిపోయింది. సింహా, ద‌మ్ము.. ఇప్పుడు స‌రైనోడె చూస్తే బోయ‌పాటి లోని యాక్ష‌న్ యాంగిల్ మా బాగా అర్థ‌మైపోతుంది. బోయ‌పాటి సినిమాలంటే ఫ్యామిలీ ఆడియ‌న్స్ కాస్త దూర‌మైంది అందుకే. కానీ.. బోయ‌పాటి ఈసారి స్టైల్ మార్చ‌బోతున్నాడ‌ట‌. యాక్ష‌న్ డోసు త‌గ్గించి… ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని సైతం ఆక‌ట్టుకొనే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టాడ‌ని టాక్‌.

స‌రైనోడు త‌ర‌వాత‌ బోయ‌పాటి శ్రీ‌ను.. బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో జ‌త క‌ట్ట‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మేలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది. త‌న శైలికి భిన్నంగా ఓ పూర్తి స్థాయి ప్రేమ‌క‌థ తీయ‌బోతున్నాడ‌ట బోయ‌పాటి. ఈసారి ఫైట్ల‌ను బాగా త‌గ్గించేశాడ‌ని టాక్‌. ఈ సినిమాలో ఉండేవి రెండే రెండు ఫైట్ల‌ట‌. అదీ.. ఇంట్ర‌వెల్‌కి ముందూ.. క్లైమాక్స్‌లో మాత్ర‌మేక‌నిపిస్తాయ‌ని తెలుస్తోంది. అయితే ఆ రెండు ఫైట్లు మాత్రం బోయ‌పాటి త‌న శైలిలో ద‌ట్టంగా భారీ స్థాయిలో తీస్తాడ‌ట‌. పోనీలెండి.. బోయ‌పాటిలో ఈమాత్రం మార్ప‌యినా వ‌చ్చింది. మున్ముందు ఇంకాస్త డోసు త‌గ్గించుకొంటూ వెళ్తే.. అంద‌రూ చూడ‌ద‌గిన సినిమాల్ని అందివ్వ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close