జల వివాదాలపై తమాషా చూస్తున్న కాంగ్రెస్, బిజెపి

అన్ని పార్టీలనూ కలుపుకుని తెలంగాణాకు సాగునీటి ప్రాజెక్టులు సాధించుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పిలుపు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం అందుకు సిద్ధంగాలేరు. అంటే…దీని అర్ధం కెసిఆర్ కు వున్న విశాలదృక్పధం చంద్రబాబుకి లేదని కాదు…రాజకీయంగా కెసిఆర్ కి వున్న సానుకూలత చంద్రబాబుకి లేదని మాత్రమే!

ప్రజాప్రయోజనాలను పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని పార్టీలు వ్యవహరిస్తూండటం వల్లే ఈ పరిస్ధితి తలఎత్తింది. ఒక సమస్య తలఎత్తినపుడు పరిష్కారంలో సాధకబాధకాలను రాజకీయపార్టీలు క్షుణ్ణంగా చర్చించి తమ విధానం ఏమిటో స్పష్టం చేయకపోవడమే ఇన్ని చిక్కుముడులకూ మూలం!

ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంలోనే కాంగ్రెస్ వేసిన ఈ చిక్కుముడి ఇప్పటికీ ప్రతి విషయంలోనూ మరింతగా బిగుసుకుపోతూనే వుంది. విభజన నిర్ణయాన్ని సోనియాగాంధీ తన పార్టీలో రెండు ప్రాంతాలవారికీ తెలియజేశారేతప్ప విభజన పర్యావసానాల్నీ, పరిష్కారాల్నీ చర్చించలేదు. ఇందువల్లే సోనియా అభీష్టం తప్ప ఆ విషయంలో పార్టీ విధానమూ లేదు. డాక్యుమెంటూ లేదు. బిజెపి అంతకుముందు ఎప్పుడో చిన్నరాష్ట్రాల విధానాన్ని ప్రకటించింది. సీమాంధ్ర, తెలంగాణా విషయంలో లోతైన చర్చ జరగలేదు. విభజనపై లెఫ్ట్ పార్టీలు మాత్రమే తమ విధానాలను స్పష్టంగా ప్రకటించాయి. కాంగ్రెస్ విధానం ఏమిటో స్పష్టం చేయాలని చంద్రబాబు నాయుడు చాలాకాలం పట్టుబట్టినా తెలంగాణాలో ఉద్యమ తీవ్రత చూసి విభజనకు ఉత్తరం ఇచ్చేశారు.

అప్పట్లో అన్ని పార్టీలూ తెలంగాణాలో విభజనకు అనుకూలంగా సీమాంధ్రలో వ్యతిరేకంగా వున్నాయి. సోనియాగాంధీ నిర్ణయమే తప్ప ఏపార్టీకీ విధానమే లేకుండా విభజన జరిగిపోయింది. ఈ తరహా విభజనవల్ల రెండు రాష్ట్రాలకూ మధ్య నీటి యుద్ధాలు తప్పవని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభలో, అప్పటి రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ పార్మెంటులో హెచ్చరించారు కూడా!

ఆ యుద్ధాలే ఇపుడు మొదలయ్యాయి. అందులో ముందు వుండటానికి అఖిల పక్షాలను కలుపుకుపోవడానికి కెసిఆర్ సంసిద్ధత వ్యక్తం చేశారు.తెలంగాణాలో తప్ప మరే రాష్ట్రంలోనూ ఉనికే లేని టిఆర్ఎస్ కు అఖిల పక్ష మైత్రి ఇబ్బందికరం కాదు. అంతే కాకుండా కలసిరాని పార్టీ తెలంగాణా ప్రజలకు దూరమయ్యే ఇరకాట పరిస్ధితిని కెసిఆర్ ముందుకి తెచ్చారు.

ఈ సౌలభ్యం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడూ అయిన చంద్రబాబు నాయుడికి లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో తెలంగాణాకు అనుకూలమైతే అది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. ఎపి ప్రయోజనాలే ముఖ్యమనుకుంటే తెలంగాణా ప్రయోజనాలు దెబ్బతింటాయి.

ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత సాహసం చూపి ఎపి ప్రయోజనాలే ముఖ్యమని తేల్చేసింది. ఇది తెలుగుదేశాన్ని ఇరకాటంలో పెట్టడానికే అనే ఉద్దేశ్యం వున్నాకూడా తెలంగాణా ప్రజలకు దూరమవ్వడానికే జగన్ నిర్ణయించుకున్నారని లెక్కతేలిపోయింది.

మొత్తం వ్యవహారాన్ని కాంగ్రెస్, బిజెపి పార్టీలు తమాషాగా చూస్తున్నాయి. కృష్ణా, గోదావరి నదుల పరీవాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉనికీ, మనుగడా వున్న బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఈ నదీ జలాల పంపిణీపై తమతమ విధానాలను ప్రకటించాలి. రాజకీయపార్టీల విధాన ప్రకటనలు ప్రజాభిప్రాయాన్ని రూపొందిస్తాయి. ఇదే రాజకీయ ప్రక్రియ.

పొలిటికల్ ప్రాసెస్ లేని ఏనిర్ణయమూ సజావుగా అమలు కాదు. అమలు అయినా విభజన సమస్యల మాదిరిగానే చిక్కుముడులలో చిక్కుకుపోతాయి.

ఇదంతా అనుభవపూర్వకంగా తెలిసి కూడా చంద్రబాబు అఖిల పక్ష సహకారం కోరటంలేదు. కోరినా మనస్ఫూర్తిగా ఎవరూ ముందుకు రారని తెలిసి కూడా కలసి పని చేద్దాం! అని కెసిఆర్ పిలుపు ఇచ్చారు.

సమస్యలపై రాజకీయపార్టీల విధాన ప్రకటన ద్వారా మాత్రమే ప్రజాప్రయోజనాలు సామరస్యంగా పరిష్కారమౌతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close