పాపం… ఆమె పాస్‌పోర్టు పోయింది

రాజుగారి గ‌ది లాంటి సినిమాల్లో మంచి పేరు తెచ్చుకొన్న హాస్య‌న‌టి విద్యుల్లేఖ‌రామ‌న్‌. ఈమ‌ద్య స‌రైనోడులోనూ బ‌న్నీకి వ‌దిన పాత్ర‌లో క‌నిపించింది. డిఫ‌రెంట్ బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీతో ఆక‌ట్టుకొంటూ ఇప్పుడిప్పుడే స్థిర‌ప‌డుతోంది. అలాంటి ఈమెకు ఓ చేదు అనుభ‌వం ఎదురైంది. ప్ర‌స్తుతం ఆస్ట్రియాలో ఉంది విద్యుల్లేఖ‌. అక్క‌డ ఈరోజు త‌న బ్యాగ్ పోయింది. ఓ హోటెల్‌లో బ‌స చేస్తున్న ఈమె ద‌గ్గ‌ర‌కు ఎవ‌రో అగంత‌కులు వ‌చ్చి మాటల్లో పెట్టి, హ్యాండ్ బ్యాగ్ ఎత్తుకుపోయార‌ట‌. అందులోనే త‌న పాస్ పోర్టు కూడా ఉంది. దాంతో.. ఆస్ట్రియాలోనే ఇరుక్కుపోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. హోటెల్ ఫుటేజీలు ఇస్తే ఎవ‌రు దొంగిలించారో క‌నుక్కోవ‌డం సుల‌భం అవుతుంద‌ని భావించినా, ఈ విష‌యంలో ఆమెకు హోటెల్ యాజ‌మాన్యం స‌హ‌క‌రించ‌డం లేద‌ట‌. ఆస్ట్రియాలో ఉన్న భార‌తీయ దౌత్యాధికారుల‌ను సంప్ర‌దించి ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని చూస్తోంది విద్యుల్లేఖ‌. మ‌రి ఏమ‌వుతుందో..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈసీకి సజ్జల ప్రశ్నలు – మండుతోందా ?

ఎన్నికల సంఘానికి ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్స్ లో ప్రశ్నలు సంధించారు. మామూలుగా అయితే ఇలాంటి సమయంలో ఆయన మీడియా ముందుకు వచ్చి కుట్ర సిద్దాంతాలు వల్లించాలి. కానీ ఆయన...

బిగ్ న్యూస్ : 2 లక్షలకు చేరనున్న గోల్డ్ రేట్..?

బంగారం ధరలు భారీగా పెగిగిపోతున్నాయి. ఏడాది, ఏడాదికి రేట్లు పైపైకి వెళ్తున్నాయి. దీంతో సామాన్యులు బంగారం కొనే పరిస్థితి మెల్లగా సన్నగిల్లడంతో పాటు ఒకప్పుడు మేమూ బంగారు ఆభరణాలు ధరించేవాళ్ళం అని చెప్పుకునే...

‘బుజ్జి’కి పేటెంట్‌.. త‌రువాతి స్టెప్ ఇదే!

ప్ర‌తిభావంత‌మైన‌ ఇంజ‌నీరింగ్ బృందం చేయాల్సిన ప‌నిని 'క‌ల్కి' టీమ్ చేసింది. సినిమా కోసం వినూత్న‌మైన డిజైన్ తో ఓ కారు త‌యారు చేసేసింది. ఆ కారులోనే ప్ర‌భాస్ ఎంట్రీ ఇచ్చి, ఫ్యాన్స్‌ని ఖుషీ...

‘పుష్ష 2’, ‘దేవ‌ర‌’, ‘గేమ్ ఛేంజ‌ర్‌’… అప్ప‌ర్ హ్యాండ్ ఎవ‌రిది?

ఒకే స‌మ‌యంలో మూడు పెద్ద సినిమాలు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంటే... క‌చ్చితంగా వాటి మ‌ధ్య పోలిక‌లు, హెచ్చు త‌గ్గుల చ‌ర్చ మొద‌ల‌వుతుంది. ఇప్పుడు 'పుష్ష 2', 'గేమ్ ఛేంజ‌ర్‌', 'దేవ‌ర' మ‌ధ్య అలాంటి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close