సూర్య తో ముడిప‌డ్డ మెగా భ‌విష్య‌త్తు

ఈరోజు సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమా సుప్రీమ్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. సినిమా యావ‌రేజ్ టాక్ సంపాదించుకొంది. సాయి రేంజుకి… ఈ టాక్ స‌రిపోతుంది. కానీ ఆ సినిమాపై ఖ‌ర్చు పెట్టిన బ‌డ్జెట్‌కి మాత్రం స‌రిపోదు. ఎందుకంటే రూ.15 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన చిత్ర‌మిది. సాయి ధ‌ర‌మ్ స్టామినాకు ఎక్కువే. దానికి తోడు బిజినెస్ మొత్తం క‌లుపుకొంటే రూ.24 కోట్ల వ‌ర‌కూ చేసింది. టేబుల్ ప్రాఫిట్‌తో దిల్‌రాజు గ‌ట్టెక్కేశాడు. అయితే బ‌య్య‌ర్ల మాటేంటో తెలాల్సివుంది. శుక్ర‌వారం 24 విడుద‌ల అవుతోంది. సూర్య క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రానికి విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌కుడు. సూర్య హ‌వా బీ, సీ సెంట‌ర్ల‌లో బాగా న‌డుస్తుంది. విక్ర‌మ్ కె.కుమార్‌కి మ‌ల్టీప్లెక్స్‌లో డిమాండ్ ఉంది. సో.. రెండు చోట్లా ఈసినిమా కుమ్మేయ‌డం ఖాయం.

ఆల్రెడీ మ‌ల్టీప్లెక్స్‌ల‌లో బుకింగ్‌లు షురూ అయిపోయాయి. టికెట్లూ జోరుగా అమ్ముడు పోతున్నాయి. 24కి హిట్ టాక్ వ‌స్తే… సుప్రీమ్ వ‌సూళ్లు డౌన్ అవుతాయి. అంటే.. ఇప్పుడు మెగా భ‌విత‌వ్యం.. సూర్య సినిమాపై ఆధార‌ప‌డి ఉంద‌న్న‌మాట‌. మ‌రోవైపు త‌ర‌ణ్ ఆద‌ర్శ్‌.. 24 సినిమా అదిరిపోయిందంటూ ట్వీట్ల‌మీద ట్వీట్లు చేస్తున్నాడు. ఇలాంటి పాజిటీవ్ బ‌జ్‌.. 24కి బాగా హెల్ప్ చేసే అవ‌కాశం ఉంది. సుప్రీమ్ బాక్సాఫీసు ద‌గ్గ‌ర నిల‌బ‌డ‌తాడా, లేదా అన్న‌ది తేలాలంటే మ‌రికొద్ది గంట‌లు ఆగితే స‌రిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close