మ‌హేష్ డేట్ ఫిక్స్ చేశాడోచ్‌

బ్ర‌హ్మోత్స‌వం ఎప్పుడు?? ఈనెల 20న వ‌స్తుందా, లేదంటే వాయిదా ప‌డుతుందా? ఇలా మ‌హేష్ అభిమానుల్లో ఎన్ని ప్ర‌శ్న‌ల్లో. ద‌ర్శకుడు శ్రీ‌కాంత్ అడ్డాల ప్ర‌తీ స‌న్నివేశాన్నీ చెక్కుతూ పోతుంటాడు. దాంతో షూటింగ్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాలు ఎప్పుటికీ తెవ‌ల‌వు. అందుకే ఈనెల 20న ఈ సినిమా రావ‌డం క‌ష్ట‌మ‌ని అనుకొన్నారు.అయితే ఆ అనుమానాల‌న్నీ మ‌హేష్ ప‌టాపంచ‌లు చేసేశాడు. ఈనెల 20 న బ్ర‌హ్మోత్సవం విడుద‌ల కావాల్సిందే అంటూ.. ఆర్డ‌ర్ వేశాడ‌ట‌. దాంతో బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ డేట్ ఫిక్స‌యిపోయింది. రేపు (శ‌నివారం) బ్ర‌హ్మోత్స‌వం ఆడియో ఫంక్ష‌న్ జ‌ర‌గ‌బోతోంది. ఈ వేడుక‌లో మ‌హేష్ స్వయంగా విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తాడ‌ని చెబుతున్నారు.

శ‌నివారం హైద‌రాబాద్‌లోని జేఆర్‌సీ ఫంక్ష‌న్ హాల్‌లో బ్ర‌హ్మొత్స‌వం ఆడియో వేడుక‌కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా సూప‌ర్ స్టార్ కృష్ణ హాజ‌ర‌వుతారు. కృష్ణ చేతుల మీదుగా ఆడియో వేడుక చేసుకొన్న మ‌హేష్ సినిమాల‌న్నీ హిట్ట‌య్యాయి. అందుకే… బ్ర‌హ్మోత్స‌వం ఆడియోనీ ఆయ‌న చేతుల మీదుగా రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం భావించింది. ఈ కార్య‌క్ర‌మానికి నాగార్జున‌, వెంక‌టేష్ లు కూడా వ‌స్తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close