‘కష్టాల్లో ఉంటే పుష్కరాలకు రు.1,600 కోట్లు ఎందుకు ఖర్చుచేశారు?’

హైదరాబాద్: ప్రత్యేకహోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ మిత్రధర్మం పాటించటంలేదని అన్నారు. అధికారయంత్రాంగంపై ప్రభుత్వం పట్టుకోల్పోయిందని విమర్శించారు. ధరలను అదుపుచేయటంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఏపీ ప్రభుత్వ నేతలు ఎప్పుడూ కష్టాల్లోనే ఉన్నామని చెప్పుకోవటం దురదృష్టకరమని అన్నారు. ప్రత్యేకహోదా రాలేదని పదేపదే చెప్పేవారు వచ్చినదానిని ఎందుకు ప్రస్తావించరని ప్రశ్నించారు. కష్టాలలో ఉంటే రు.1,600 కోట్లు పెట్టి గోదావరి పుష్కరాలను ఎందుకు చేశారని అడిగారు. ప్రత్యేకహోదా వచ్చి తీరుతుందని చెప్పారు. ఇప్పటికే బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ పుష్కరాలకు ముందు తెలుగుదేశంప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సోము వీర్రాజుకూడా అదేస్థాయిలో విమర్శలు చేశారు. మరి వీరు పార్టీ కేంద్ర నాయకత్వం ఆమోదంతోనే ఈ విమర్శలు చేస్తున్నారా, లేక వ్యక్తిగత స్థాయిలో చేస్తున్నారా అనేది ఇంకా తెలియటంలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close