‘గౌతమీపుత్ర శాతకర్ణి’ పోగ్రెస్ ఇదే..

తెలుగు ప్రేక్షకలు, నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్టీజియస్ 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఇటీవల లాంచనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తెలుగుజాతి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి. ఇటువంటి గొప్ప చరిత్ర కలిగిన తెలుగు చక్రవర్తి జీవితాన్ని వెండితెరపై సాక్షాత్కరింప చేయనున్నారు దర్శకుడు జాగర్లమూడి క్రిష్. బిబో శ్రీనివాస్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాని నిర్మిస్తున్నారు. ఇటీవల జాతీయఅవార్డును సొంతం చేసుకున్న క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేశారు.

ఎన్నో హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన టాప్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పనిచేయనున్నారు. నందమూరి బాలకృష్ణ తన వందవ చిత్రంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా టైటిల్ అనౌన్స్ చేయగానే సినిమా ఎలా ఉంటుందోనని సినిమాపై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్లే సినిమా కోసం, పాత్ర కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే బాలకృష్ణను ఈ సినిమా కోసం లుక్ నుండి ప్రతి విషయంలో కేర్ తీసుకుని సన్నద్ధం చేస్తున్నారు దర్శకులు క్రిష్. మొరాకోలోని అద్భుతమైన లోకేషన్స్ లో ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ మే 9న ప్రారంభం కానుంది. ఒకటవ శతాబ్దానికి చెందిన సీన్స్ ను, రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో హాలీవుడ్ ఫైటర్స్ తో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అల్రెడి మ్యూజిక్ స్టార్ట్ చేసేశారు. అన్నీ విధాలుగా అందరినీ అలరించే చిత్రాన్ని రూపొందించేలా సన్నాహాలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close