శ్రీ‌దివ్య ఎంత మంచిదో…

మ‌ల్లెల తీరంలో సిరిమ‌ల్లె పువ్వు, బ‌స్ స్టాప్ చిత్రాల‌తో ఆకట్టుకొంది శ్రీ‌దివ్య‌. ఇప్పుడు పెన్సిల్ సినిమాలో న‌టించింది. విశాల్ రాయుడులోనూ త‌నే క‌థానాయిక‌. తెలుగ‌మ్మాయే అయినా, త‌మిళం నుంచి కూడా త‌న‌కు మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. త‌మిళంలో శ్రీ‌దివ్య‌ని త‌మ ఇంటి అమ్మాయిగానే చూసుకొంటున్నారు. దాంతో త‌మిళ ప్రేక్ష‌కుల‌పై కూడా శ్రీ‌దివ్య ప్రేమ పెంచుకొంది. అక్క‌డ త‌న‌వంతుగా సేవా కార్య‌క్ర‌మాల్ని చేస్తోంద‌ట‌. ఈ విష‌యాన్ని క‌థానాయ‌కుడు విశాల్‌ స్వ‌యంగా చెప్పాడు.

ఈమ‌ధ్య చెన్నైని వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. ఆ సంద‌ర్భంలో శ్రీ‌దివ్య ఏకంగా రూ.10 ల‌క్ష‌ల ఆర్థిక స‌హాయాన్ని ప్ర‌క‌టించింద‌ట‌. అంతేకాదు.. కొన్ని గ్రామాల్లో క‌నీసం మ‌హిళ‌ల‌కు మ‌రుగుదొడ్డి స‌దుపాయాలు లేవ‌ని న‌డియార్ సంఘం టాయ్‌లెట్ల‌ను క‌ట్టివ్వాల‌నుకొంది. శ్రీ‌దివ్య అప్ప‌టిక‌ప్పుడు త‌న వంతుగా ప‌ది టాయ్‌లెట్ల‌కు అవ‌స‌ర‌మ‌య్యే ఆర్థిక స‌హాయాన్ని అందించింద‌ట‌. ”న‌డియార్ సంఘంలో శ్రీ‌దివ్య కీల‌క స‌భ్యురాలు. మేం ఎప్పుడు ఏం అడిగినా నో చెప్ప‌దు. అంత‌మంచి అమ్మాయి” అంటూ విశాల్ తెగ పొగిడేస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close