ర‌కుల్‌కి ఫ్లాప్స్ కూడా ఇష్ట‌మేన‌ట‌

”నేను మిల‌ట‌రీ కుటుంబం నుంచి వ‌చ్చిన‌దాన్ని. క్ర‌మ‌శిక్ష‌ణ నా ఆయుధం.. నేను త‌ప్పు చేసే అవ‌కాశ‌మే లేదు” అంటోంది ర‌కుల్ ప్రీత్ సింగ్. కెరీర్ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి తప్పూ చేయ‌లేద‌ట‌. సినిమా హిట్ట‌యినా ఫ్లాప్ అయినా… త‌న వైపు నుంచి ఎలాంటి త‌ప్పూ లేకుండా జాగ్ర‌త్త ప‌డుతూ వ‌చ్చింద‌ట‌. అదే.. త‌నని కాపాడుతోంద‌ని, అందుకే త‌న‌కు అవ‌కాశాలొస్తున్నాయ‌ని చెబుతోంది ర‌కుల్‌. ”హిట్టు, ఫ్లాప్ గురించి నేనెప్పుడూ ఆలోచించ‌ను. ఆసినిమా కోసం నేనేం చేశాను? వంద శాతం ప్ర‌తిభ క‌న‌బ‌రిచానా, లేదా? అన్న‌దే కీల‌కం. ఈ విష‌యంలో ప్ర‌తీ సినిమాలోనూ నేను విజ‌యం సాధించా. ర‌కుల్ బాగా క‌ష్ట‌ప‌డుతుంది అనే పేరు తెచ్చుకొన్నా. అందుకే.. నా కెరీర్‌కి ఎలాంటి ఢోకా లేకుండా పోయింది” అంటోంది ర‌కుల్‌.

అంతేకాదు.. ఫ్లాప్ సినిమాలో న‌టించినా ర‌కుల్‌కి ఎప్పుడూ బాధ క‌ల‌గ‌లేద‌ట‌. పైపెచ్చు ఫ్లాప్ సినిమాలు కూడా త‌న‌కు సంతృప్తి క‌లిగించాయ‌ట‌. ఫ్లాప్‌లోన‌టించ‌డం వ‌ల్లే ఎక్కువ విష‌యాలు నేర్చుకోవ‌చ్చ‌ని, అందుకే ప‌రాజ‌యాల్ని ఇష్టంగా స్వీక‌రిస్తాన‌ని అంటోంది ర‌కుల్‌. ఒక‌ట్రెండు ఫ్లాపుల‌యితే ఒకే. కానీ అదే ప‌నిగా ఫ్లాపులు కొడుతుంటే ఐరెన్ లెగ్ అనే ముద్ర ప‌డే ప్ర‌మాదం ఉంది. ఈ విష‌యాన్ని ర‌కుల్ తెలుసుకొంటే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బటన్ నొక్కి లబ్దిదారుల నోట్లో మట్టి – డబ్బుల్లేవా ?

పోలింగ్ కు రెండు రోజుల ముందు లబ్దిదారుల ఖాతాల్లో రూ. 14వేల కోట్లు వేసేస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ డబ్బులు జమ చేయడం లేదు. ఇదిగో అదిగో అంటూ ...

హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్…ఎందుకంటే..?

జూనియర్ ఎన్టీఆర్ తన ల్యాండ్ కు సంబంధించి వివాదం తలెత్తడంతో హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 75లో ఉన్న ప్లాట్ విషయంలో ఈ వివాదం తలెత్తింది. 2003లో గీత లక్ష్మీ అనే...

సరైన ఏర్పాట్లు ఉంటే ఏపీలో 90 శాతం పోలింగ్ !

దేశంలో అత్యధిక రాజకీయ చైతన్యం ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 82 శాతం వరకూ పోలింగ్ నమోదయింది. అంతా పెద్ద పెద్ద క్యూలైన్లు ఉండటాన్ని గొప్పగా చెబుతున్నారు. కానీ పోలింగ్ పర్సంటేజీ...

ఇసుక మాఫియాకు సుప్రీంకోర్టు లెక్కే కాదు !

ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తోంది. ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశిస్తోంది. కానీ ఎప్పటికప్పుడు మాఫియా మాత్రం అబ్బే ఇసుక...

HOT NEWS

css.php
[X] Close
[X] Close