వామపక్షాలకు భవిష్యత్తు లేదా?

పశ్చిమ బెంగాల్‌లో రెండవ సారి మమతా బెనర్జీ తృణమూల్‌ కాంగ్రెస్‌ చేతిలో ఘోరమైన ఓటమిపాలైన సిపిఎం వామపక్షాలకు ఇంక భవిష్యత్తు వుండదనిచాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈ దారుణ పరాజయం పక్కనే కేరళలో అఖండ విజయం అసాధారణ ఆధిక్యత కూడా చూడవలసిందే. కేరళలో ఎన్నికల్లో గెలిచినా అచ్యుతానందన్‌, పినరాయి విజయన్‌ మధ్య ఏదో ఘర్షణ జరుగుతుందంటే అదేమీ లేకుండానే కొత్త ముఖ్యమంత్రి ఎంపిక పూర్తయింది. కనుక ఈ ఫలితాల తర్వాత సిపిఎంలో తీవ్రమైన రాజకీయ సంక్షోభం వచ్చేస్తుందని కొన్ని మీడియా సంస్థలు రాస్తున్నదానికి ఆధారం లేదు. తీవ్రమైన సైద్ధాంతిక వాదోపవాదాలు జరగొచ్చు.నిష్కర్షగా చర్చించుకోవచ్చు గాని నిరుత్సాహం నిస్రృహగా మారకుండా సిపిఎం నాయకత్వం శ్రద్ద తీసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా కేంద్రీకరించి పనిచేయొచ్చు.

మమతా బెనర్జీ నిర్బంధం, శారదా నుంచి నారద వరకూ నడిచిన భాగోతాలుచాలా దారుణమైనవి. వీటిని ఫ్రధాని మోడీతో సహా అందరూ విమర్శించారు. అయినా ఆమె మరోసారి గెలుపు సాధించడానికీ ప్రజాదరణేగాక కేంద్ర బిజెపి సహకారం తోడైంది. కమ్యూనిస్టు వ్యతిరేకతకు పేరుమోసిన కాంగ్రెస్‌ వాదులు కూడా ఆమెకే ఓటు వేసినట్టు కనిపిస్తుంది. ప్రజానుకూల విధానాలతో 34 ఏళ్లపాటు అవిచ్చిన్నంగా పాలించి ప్రపంచ రికార్డు స్థాపించిన వామపక్ష ప్రభుత్వంపై చివరి దశలో పొరబాట్ల కారణంగా తలెత్తిన ప్రజాగ్రహం, అసంతృప్తి ఇంకా పూర్తిగా తొలగిపోలేదని కూడా ఫలితాలు స్పష్టం చేశాయి. అప్పటి పరిపాలనా కాలంలో ప్రజలతో సంబంధాలు దెబ్బతినడం, ఇప్పుడు ప్రభుత్వ నిర్బంధం తృణమూల్‌ హత్యాకాండ కారణంగా ప్రజల్లోకి వెళ్లి పనిచేసే పరిస్థితిలేకపోవడం వంటివన్నీ వామపక్షాలను దెబ్బతీశాయి. కాంగ్రెస్‌తో కలవడం వల్లనే ఇంత నష్టం జరిగిందని వస్తున్న విమర్శలకు బెంగాల్‌ సిపిఎం నాయకుదు సూర్యకాంత్‌ మిశ్రా ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా వుంది. ఈ అవగాహనేలేకపోతే బిజెపి రెండవ స్తానంలో వచ్చేదని ఆయన సూటిగానే చెప్పేశారు. సిపిఎంకు 2014 పార్లమెంటు ఎన్నికల్లోనూ ఇప్పుడూ కూడా 29 అసెంబ్లీ సెగ్మెంట్లే వచ్చాయని కూడా ఆయన వివరించారు. కనుక 2011తో పోల్చి బలం ఏదో తగ్గిపోయిందని చెప్పడానికి కూడా లేదు. దీనిపై లోతైన సమీక్ష జరపనున్నట్టు సిపిఎం ఆచితూచి ప్రకటించింది తప్ప తక్షణ వ్యాఖ్యలు చేయలేదు. అంత దీర్ఘకాలం పాలించి వివిధ రకాల ఎన్నికల్లో కొన్ని డజన్ల సార్లు గెలుపొందిన వామపక్ష ఫ్రంట్‌ గత కొన్నేళ్లలో ఓడిపోతున్నది గనక దాని మనుగడే వుండదన్నట్టు కొంతమంది సీనియరన ఎడిటర్లు రాయడంలో వాస్తవికత కనిపించదు. తెలుగుదేశం, కాంగ్రెస్‌ వంటిపార్టీలే వరుస ఓటముల తర్వాత కూడా బతికిబట్టకట్టినప్పుడు సిద్ధాంత బలం కార్యకర్తల సైన్యం ఆత్మ విమర్శ అలవాటు వున్న సిపిఎం వంటి పార్టీ దీంతోనే కూలిపోతుందని ఆశించడం అర్థంలేని పని. నిస్సందేహంగా ఈ సవాళ్లు తీవ్రమైనవే అయినా సమీక్షానంతరం సానుకూల కార్యాచరణతో దాన్ని అధిగమించేందుకు కమ్యూనిస్టులు ఏ విధంగా దృష్టి పెడతారో చూడాలి.

బిజెపి బ్రహ్మాండంగా పెరిగిపోతుందని చెబుతున్నా వాస్తవానికి ఈ ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరుగుతుంది. మమత జయ వంటి వారు బిజెపికి ఏదోలా సహకరిస్తారు. మరోవైపున వారికి కొంచెం భిన్నమైన కేజ్రీవాల్‌, నితిష్‌ కుమార్‌ నవీన్‌ పట్నాయక్‌,కెసిఆర్‌ వంటి వారు ఏం చేస్తారనే ప్రశ్న కూడా వుంది. యుపిలో ఎస్‌పి బిఎస్‌పిల పాత్ర రాజకీయ వైరుధ్యాలు కూడా వున్నాయి. ముందే చెప్పుకున్నట్టు యుపి ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో మరో దఫా రాజకీయ మధనం జరుగుతుంది.అదే 2019 లోక్‌సభ ఎన్నికలకు భూమిక ఏర్పరుస్తుంది. జయాపజయాలతో నిమిత్తం లేకుండా కేంద్రంలోనూ రాష్ట్రాలలోనూ మత రాజకీయాలను వినాశకర ఆర్థిక విధానాలను అవినీతి వ్యవహారాలను అరికట్టడంలోనే భవిష్యత్తు దాగివుంటుంది. ఆ కృషిలో వామపక్షాలు ముందే వుంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close