కాంగ్రెస్, వైకాపాలు ప్రజలను రెచ్చగొడుతున్నాయిట!

కాంగ్రెస్, వైకాపాలు రెండూ రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిపోతుందంటూ రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయని ఏపి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రాన్ని తన ఇష్టం వచ్చినట్లు విభజించిన కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ధర్నాలు చేస్తోందని ప్రశ్నించారు. తెరాసతో కుమ్మక్కయిన జగన్ దీక్షల పేరిట డ్రామాలు ఆడుతుంటే, కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తూ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా తన పార్టీ నేతలకు తెలంగాణాలో ప్రాజెక్టులను ఇప్పించి, మళ్ళీ ఇక్కడ వాటికి వ్యతిరేకంగా డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తన పార్టీకి మనుగడ కోల్పోతుందనే భయంతో జగన్ దానిని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని దేవినేని ఆరోపించారు. రెండు పార్టీలు కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని దేవినేని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల అభీష్టాన్ని పట్టించుకోకుండా రాష్ట్ర విభజన చేసినందుకు ప్రజలు దానికి తగిన విధంగానే బుద్ధి చెప్పారు. అది తన మనుగడ కాపాడుకోవడానికే ప్రత్యేక హోదా లేదా మరో అంశంపైనో ఉద్యమిస్తోందని రాష్ట్ర ప్రజలు కూడా గ్రహించారు గాబట్టే దాని ఉద్యమాలకి ఎవరూ స్పందించడం లేదు. వైకాపా పరిస్థితి అదే కానీ ఒక వర్గం ప్రజలలో జగన్ కి ఇంకా మంచిఆదరణ ఉన్నందునే ఆయన పట్ల వారు సానుకూలంగా స్పందిస్తున్నారు.

అ రెండు పార్టీలు తమ మనుడగ కోసమే ఉద్యమాలు చేస్తున్నాయని అనుకొంటే, మరి తెదేపా నేతలు కూడా రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతోందని ఎందుకు వాదిస్తున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా చాలా మంది మంత్రులు, నేతలు కూడా “రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతోంది కేంద్రాన్ని గట్టిగా అడుగుతున్నామని” చాలాసార్లు అన్నారు. వారందరూ కూడా కాంగ్రెస్, వైకాపా నేతలు అంటున్న మాటలనే అంటున్నారు. మరి తెదేపా నేతలు మాట్లాడితే తప్పు లేనప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడితే ఎలా తప్పవుతుంది?

ఒకవేళ ఏదో ఒకరోజు తెదేపా, భాజపాలు తెగతెంపులు చేసుకొంటే అప్పుడు దేవినేనితో సహా తెదేపా నేతలందరూ హామీల అమలు చేయనందుకు కేంద్రాన్ని విమర్శించకుండా ఉంటారా? అవసరం అయితే ఉద్యమించకుండా ఉంటారా? ఇంక తెదేపా నేతలు అందరూ గత రెండేళ్లుగా రాజధాని, పోలవరం నిర్మించి చూపుతామని చెప్పడమే తప్ప ఇంతవరకు అడుగు ముందుకు పడటం లేదు. అసలు పనులే మొదలుపెట్టకుండా, ఇంకా ఎప్పటికయినా పూర్తవుతుందో లేదో తెలియని పోలవరం ప్రాజెక్టుని జగన్ ఆపడానికి ప్రయత్నిస్తున్నారని దేవినేని ఆరోపించడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

తెదేపా, భాజపాతో సహా అన్ని రాజకీయ పార్టీలు తమ తమ స్వలాభం కోసం ఏదో పేరు చెప్పుకొని హడావుడి చేస్తూనే ఉంటాయి. వాటి పోరాటాల వెనుక ఉద్దేశ్యాలు, వ్యూహాలు అన్నీ ప్రజలకి తెలుసు. కనుక అవసరం అయినప్పుడు ఏ పార్టీతో ఏ విధంగా వ్యవహరించాలో వారికి బాగా తెలుసు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close