బ‌న్నీ వేరు కుంప‌టి పెట్టేస్తున్నాడా??

ఇప్పటి వ‌ర‌కూ మెగా ఫ్యాన్స్‌గా ఉన్న కుటుంబం ఇప్పుడు మెగా ఫ్యాన్స్ – అల్లు ఫ్యాన్స్‌గా విడిపోతోందా?? మెగా కుటుంబం నుంచి బ‌న్నీ వేరు కుంప‌టి పెట్ట‌బోతున్నాడా?? ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో జ‌రుగుతున్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ ఇది. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాలు బ‌న్నీకి చేదు అనుభ‌వాన్ని క‌లిగించాయ‌ని, అందుకే బ‌న్నీ ఈ సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యం తీసుకొన్నాడ‌ని భోగ‌ట్టా. చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అన్న కామెంట్ ని ప‌ట్టుకొని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ రేపిన దుమారం. బ‌న్నీని హ‌ర్ట్ చేసింద‌ట‌. తాను సొంత‌కాళ్ల‌పై నిల‌బ‌డినా ఇప్ప‌టికీ ఒక‌రి గొడుగు నీడ‌న ఉండ‌డం.. త‌న‌కు న‌చ్చ‌డం లేద‌ని అందుకే అల్లు ఫ్యాన్స్ అన్న పేరు జ‌నంలోకి తీసుకెళ్లాల‌ని, త‌న‌కంటూ సేప‌రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌ర‌చుకోవాల‌ని గ‌ట్టిగా నిర్ణ‌యం తీసుకొన్న‌ట్టు తెలుస్తోంది.

ఈ విష‌యంలో అల్లు అర‌వింద్ కూడా బ‌న్నీని స‌పోర్ట్ చేస్తున్న‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఒక మ‌న‌సు ఆడియో వేడుక‌లో బ‌న్నీ మాట్లాడిన ప‌ద్ధ‌తి చిరంజీవికి కూడా న‌చ్చ‌లేద‌ట‌. ఈ విష‌యంపై చిరు బ‌న్నీని మంద‌లించార‌ని, దాంతో బ‌న్నీ మ‌రింత హ‌ర్ట‌య్యాడ‌ని… వేరు కుంప‌టి పెట్టి, త‌న అభిమాన గ‌ణాన్ని పెంచుకోవ‌డమే ఉత్త‌మ‌మ‌ని బ‌న్నీ భావిస్తున్నాడ‌ని తెలుస్తోంది. బ‌న్నీ స‌న్నిహితులు కూడా ‘నీకంటూ ఓ స్టార్ డ‌మ్ వ‌చ్చింది.. ఇక ఎవ‌రి అండా అవ‌స‌రం లేదు’ అని బాగానే ఎక్కిస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రి.. బ‌న్నీ నిర్ణ‌యం త‌న కెరీర్‌ని ఎలాంటి మ‌లుపుల‌కు, కుదుపుల‌కూ గురి చేస్తుందో తెలియాలంటే.. కాస్త ఓపిక ప‌ట్టాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close