ముమైత్ మ‌రీ ఇంత‌లానా..?

ఒక‌ప్పుడు ఐటెమ్ పాట‌తో ఒక ఊపు ఊపేసింది ముమైత్‌ఖాన్‌. క‌మ‌ర్షియ‌ల్ సినిమా అంటే ఐటెమ్ సాంగ్ ఉండాల్సిందే, ఐటెమ్ సాంగ్ అంటే అందులో ముమైత్‌ఖాన్ చిందేయాల్సిందే అన్నంత‌గా సాగింది ఆమె హ‌వా. ఒక ద‌శ‌లో టాప్ హీరోయిన్ల‌కు సైతం షాకిచ్చేంత పారితోషికం అందుకొంది. క్ర‌మంగా ఐటెమ్ పాట‌తో పాటు ఆమె హ‌వా కూడా త‌గ్గింది. ముమైత్ ఖాన్‌ని అంతా మ‌ర్చిపోయారు. స్లిమ్‌గా మారి, కొత్తాందాల‌తో మెరిసినా ఆమెనెవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. దాంతో.. ఏం చేయాలో తెలీక‌, ఆదాయ మార్గం లేక – గ్రామాల్లో జ‌రిగే జాత‌ర్ల‌కు సైతం స్టెప్పులేసేంత‌గా దిగ‌జారిపోయింది.

విశాఖ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో జ‌రిగిన జాత‌ర్లో ముమైత్ ఖాన్ పాల్గొని, స్టెప్పులేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. స్థానిక నాయ‌కుల ప్రొగ్భ‌తంతో ముమైత్ ఈ వేడుక‌కు వ‌చ్చినా, అమె అందుకొన్న రొక్కం మాత్రం వేల‌ల్లోనే అని స‌మాచారం. పాట‌కు ఇర‌వై ల‌క్ష‌లు తీసుకొన్న ముమైత్ ఖాన్‌.. ఇంత త‌క్కువ మొత్తానికి స్టెప్పులేయ‌డానికి ఒప్పుకొందంటే, అదీ ఏమాత్రం ర‌క్ష‌ణ లేని చోట‌… ముమైత్ ఖాన్ ప‌రిస్థితి ఎంతకు దిగ‌జారిందో అర్థం చేసుకోవొచ్చు. ఆమ‌ధ్య‌న త‌న‌కు తెలిసిన ద‌ర్శ‌కుల చుట్టూ అవ‌కాశాల కోసం తెగ తిరిగింద‌ట‌. కానీ… వాళ్లంతా హ్యాండివ్వ‌డంతో ఏం చేయాలో పాలుపోక‌.. వ‌చ్చిన ఇలాంటి చిన్నా చిత‌కా ఆఫ‌ర్ల‌ను ఒప్పుకొంటోంది. పాపం..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close