షాకింగ్‌: విల‌న్ గా బ‌న్నీ?

తెలుగు హీరోలు ఇప్పుడిప్పుడే కాస్త కొత్త‌ద‌నం గురించి కూడా ఆలోచించ‌డం మొద‌లెట్టారు. పాత్ర బాగుంటే చాలు.. ఇంకేం ఆలోచించ‌డం లేదు. ఆఖ‌రికి నెగిటీవ్ షేడ్ ఉన్న పాత్ర అయినా స‌రే.. చేయ‌డానికి రెడీ అంటున్నారు. తాజాగా అల్లుఅర్జున్‌కీ అదే ఆలోచ‌న వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. స‌రైనోడు హిట్టుతో సూప‌ర్ ఫామ్‌లోకి వ‌చ్చేశాడు బ‌న్నీ. ఇప్పుడు త‌దుప‌రి సినిమాపై దృష్టి పెట్టాడు. లింగు స్వామి బ‌న్నీకి క‌థ చెప్ప‌డం, దాన్ని బ‌న్నీ ఓకే చేయ‌డం జ‌రిగిపోయాయి. జులైలో ఈ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. ఈ స్టోరీలో లేటెస్టు ట్విస్టు ఏంటంటే.. ఇందులో బ‌న్నీ పాత్ర రెండు కోణాల్లో సాగుతుంద‌ట‌. ఓ పాత్ర‌లో విల‌న్ షేడ్స్ ఉంటాయ‌ని.. హీరో, విల‌న్ రెండు పాత్ర‌లూ బ‌న్నీనే పోషిస్తున్నాడ‌ని టాక్‌.

లింగుస్వామిదంతా యాక్ష‌న్ స్టైల్‌. కాక‌పోతే.. ఆయ‌న క‌థ‌ల్లో ఎక్క‌డో ఓ చోట యునిక్ ఎలిమెంట్ ఉంటుంది. అలాంటి పాయింట్‌తో బ‌న్నీని ఒప్పించాడ‌ట లింగుస్వామి. స‌రైనోడు త‌ర‌వాత క‌థ విష‌యంలో చాలా త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డిన బ‌న్నీకి లింగుస్వామి క‌థ‌పై గురి కుదిరింద‌ని, చాలా ఆలోచించీ, ఆలోచించీ ఈ ప్రాజెక్టు ఓకే చేశాడ‌ని తెలుస్తోంది. స్ర్కిప్టు ప‌నులు పూర్తి చేసుకొన్న ఈ సినిమా.. ప్ర‌స్తుతం న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల అన్వేష‌ణ‌లో ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close