టైటిల్‌తోనే సినిమాపై సగం ఆసక్తి సృష్టించడానికి ప్రయత్నిస్తుంటారు దర్శకుడు. మాసీ టైటిల్ దొరికితే… పండగే ఇక. సాయిధరమ్ తేజ్ అలాంటి టైటిళ్లతోనే ఆకట్టుకొంటున్నాడు. ఇటీవల సుప్రీమ్ గా హిట్టు కొట్టిన సాయి.. ఇప్పుడు జవాన్‌గా మారబోతున్నాడని టాక్. ప్రస్తుతం తిక్క షూటింగ్లో బిజీగా ఉన్న సాయి.. ఆ తరవాత బీవీఎస్ రవి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి జవాన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. టైటిల్‌ని బట్టి ఇది ఓ సైనికుడి కథ అని అర్థం చేసుకోవొచ్చు. మొన్నే మరో మెగా హీరో వరుణ్‌తేజ్ కంచెలో జవాన్‌గా కనిపించాడు. అయితే వరుణ్ హైటు, అతని పర్సనాలిటీ ఆ క్యారెక్టర్‌కి బాగా సూటయ్యాయి. జవాన్‌గా సాయిధరమ్ అంటే.. టైటిల్‌కి జస్టిఫికేషన్ జరుగుతుందా అనే డౌటు పుట్టుకొందిప్పుడు. చిత్రబృందానికీ ఈ విషయంలో కాస్త కంగారుగానే ఉందని వినికిడి. అయితే.. జవాన్ టైటిల్ అయితే జనంలోకి ఈజీగా వెళ్లిపోతుందని, ఈ టైటిలే బాగుందని సాయి చెబుతున్నాడట. చూద్దాం.. చివరికి ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారో..???