‘గుండె’ ప‌క్క‌నెట్టిన నితిన్‌

అ.ఆ సినిమాతో త‌న కెరీర్‌లో మ‌రో సూపర్ హిట్‌ని వేసేసుకొన్నాడు నితిన్‌. ఈ సినిమాతో నితిన్ మార్కెట్ మ‌రి కొంచెం పెరిగింద‌న్న‌ది వాస్త‌వం. మ‌రీ ముఖ్యంగా ఓవ‌ర్సీస్‌లో ఓవ‌ర్ నైట్ స్టారైపోయాడు నితిన్‌. దాంతో నితిన్ త‌దుప‌రి సినిమా ఎప్పుడు, ఎవ‌రితో అన్న విష‌యాల్లో ఆస‌క్తి మొద‌లైపోయింది. కొండా విజ‌య్ కుమార్‌తో ఓ సినిమా చేస్తాన‌ని మాటిచ్చాడు నితిన్‌. నితిన్‌తో గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సినిమాని తెర‌కెక్కించాడు కొండా. ఆసినిమా సూప‌ర్ హిట్ట‌య్యింది. ఆ న‌మ్మ‌కంతోనే కొండా చెప్పి క‌థ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. గుండెజారికి ఇది సీక్వెల్ అన్న ప్ర‌చారం కూడా జ‌రిగింది.

అయితే నితిన్ ఇప్పుడు త‌న మ‌న‌సు మార్చుకొన్నాడ‌ని టాక్‌. గుండెజారి – 2ని ప‌క్క‌న పెట్టి మ‌రో ద‌ర్శ‌కుడితో ట్రావెల్ అవ్వ‌డానికి రెడీ అవుతున్నాడ‌ట‌. ఆ ద‌ర్శ‌కుడెవ‌రో కాదు, కిషోర్ తిరుమ‌ల శెట్టి. నేను – శైల‌జ‌తో రామ్‌కి ఓ హిట్టిచ్చాడు కిశోర్‌. ఇప్పుడు నితిన్‌కి ఓ స్టోరీ వినిపించాడ‌ట‌. ఆ క‌థ నితిన్‌కి బాగా న‌చ్చ‌డంతో వెంట‌నే పట్టాలెక్కించ‌డానికి రెడీ అయిన‌ట్టు టాక్‌. అ.ఆ త‌ర‌వాత నితిన్ చేయ‌బోయే సినిమా ఇదేన‌ని చెప్పుకొంటున్నారు. ఈ చిత్రాన్ని త‌న సొంత బ్యాన‌ర్‌లోనే తెర‌కెక్కించాల‌ని నితిన్ ఫిక్స‌య్యాడ‌ట‌. క‌థ‌పై అంత గురి కుదిరింద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close