జ‌న‌తా గ్యారేజ్‌.. స్టెప్పులు కేక‌!

ఎన్టీఆర్ సూప‌ర్ డాన్స‌ర్‌.. ఇది అంద‌రూ చెప్పే మాటే. ఎన్టీఆర్‌తో డాన్స్ చేయ‌డం మామూలు విష‌యం కాద‌ని క‌థానాయిక‌లే ఒప్పుకొంటారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అంత‌టివాడే.. ఓ సంద‌ర్భంలో ఎన్టీఆర్ డాన్సుల్ని మెచ్చుకొన్నాడు కూడా. ప‌దిహేనేళ్లుగా త‌న డాన్సుల‌తో అబ్బుర ప‌రుస్తూనే ఉన్నాడు తార‌క్‌. ఇప్పుడు జ‌న‌తా గ్యారేజ్‌లో కూడా అదిరిపోయే స్టెప్పులు వేయ‌బోతున్నాడ‌ట‌. ఎన్టీఆర్ – కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న‌ జ‌న‌తా గ్యారేజ్ షూటింగ్ ఇప్పుడు టాకీ నుంచి పాట‌ల‌కు షిఫ్ట్ అయ్యింది. అస‌లే నాన్న‌కు ప్రేమ‌తో హిట్ అయిన మూడ్‌లో ఉన్నాడేమో.. ఈసినిమాలో మ‌రింత‌గా విజృంభించి స్టెప్పులు వేయాల‌ని చూస్తున్నాడ‌ట ఎన్టీఆర్‌. నిజానికి నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలో స్టెప్పులు వేసే అవ‌కాశం అంత‌గా రాలేదు. అందుకే.. జ‌న‌తా గ్యారేజ్‌తో త‌న‌కు తానుగా స్పేస్ తీసుకొన్నాడ‌ట‌.

గురువారం నుంచి హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్ సెవెన్ ఏక‌ర్స్‌లో ఎన్టీఆర్‌, స‌మంత‌ల‌పై జ‌న‌తా గ్యారేజ్ పాట తెర‌కెక్కిస్తారు. దీనికి శేఖ‌ర్ మాస్ట‌ర్ డాన్స్ కంపోజ్ చేయ‌నున్నారు. శేఖ‌ర్ ఎన్టీఆర్ కోసం అదిరిపోయే స్టెప్పుల్ని కంపోజ్ చేశాడ‌ట‌. ఈ ఆల్బ‌మ్‌లో ఇదే ప‌ర‌మ మాస్ పాట అని తెలుస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే ఇందులో ఓ సిగ్నేచ‌ర్ స్టెప్‌ని క్రియేట్ చేశాడట శేఖ‌ర్ మాస్ట‌ర్‌. ఆ స్టెప్పు అభిమానుల్ని మైమ‌ర‌పిస్తుంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. మ‌రి ఎన్టీఆర్ డాన్సింగ్ మేళా ఎలా సాగిందో తెలియాలంటే జ‌న‌తా గ్యారేజ్ వ‌చ్చే వ‌ర‌కూ ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close