ద‌టీజ్ ప‌వ‌న్ : గురువు రుణం తీర్చుకొన్నాడు

త‌న హీరోయిజాన్ని కేవ‌లం వెండి తెరకే ప‌రిమితం చేయ‌లేదు ప‌వ‌న్ క‌ల్యాణ్. నిజ జీవితంలోనూ హీరో అనిపించుకొన్నాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని ఇన్ని కోట్ల‌మంది ఆరాధించ‌డానికీ, అత‌ని నిజాయ‌తీ కీర్తించ‌డానికి కార‌ణం ఇదే. పావ‌లా శ్యామ‌లా ఇబ్బందుల్లో ఉంటే త‌క్ష‌ణం ఆర్థిక స‌హాయం చేసిన వైనం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అలాంటి సంఘ‌ట‌నే జ‌రిగింది..ప‌వ‌న్ మంచిత‌నానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం దొరికింది. ప‌వ‌న్‌కి న‌ట‌న‌కు సంబంధించిన పాఠాలు నేర్పిన గురువు స‌త్యానంద్‌, ప‌వ‌న్‌కే కాదు, చాలామంది స్టార్ హీరోల‌తో ఆయ‌న ఓన‌మాలు దిద్దించారు. ప‌వ‌న్‌కీ.. న‌ట‌న‌లో ఆయ‌నే గురువు. సినిమాల్లోకి వ‌చ్చి, స్టార్ అయిన త‌ర‌వాత కూడా త‌న గురువుని మ‌ర్చిపోలేదు ప‌వ‌న్‌. వీలున్న‌ప్పుడ‌ల్లా ఫోన్‌లో ప‌ల‌క‌రిస్తూ, యోగ క్షేమాలు తెలుసుకొంటూనే వ‌స్తున్నాడ‌ట‌.

స‌త్యానంద్ త‌న చెల్లాయి పెళ్లి చేయ‌డానికి తెగ ఇబ్బంది ప‌డుతున్నాడ‌ని, ఆర్థికంగా బాగా చితికిపోయాడ‌ని తెలుసుకొన్న ప‌వ‌న్‌… అప్ప‌టిక‌ప్పుడు రూ.50 వేల రూపాయ‌లు అందించాడ‌ట‌. అంతేకాదు.. పెళ్లి వెళ్లి, ఆ న‌వ‌దంప‌తుల్ని ఆశీర్వదించి వ‌స్తూ వ‌స్తూ మ‌రికొంత న‌గ‌దు చేతిలో పెట్టి వ‌చ్చాడ‌ట‌. అడిగినా స‌హాయం చేయ‌ని ఈరోజుల్లో ప‌వ‌న్ త‌న‌కు అడ‌క్కుండానే స‌హాయం చేశాడ‌ని, క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడు అర్థికంగా ఆదుకొన్నాడ‌ని స‌త్యానంద్ పొంగిపోతున్నాడు. ప‌వ‌న్ ఇలా గురువు రుణం తీర‌చుకొన్నాడ‌న్నమాట‌. ద‌టీజ్ ప‌వ‌న్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close