పరాకాష్టకి చేరిన టీ-కాంగ్రెస్ లో అంతర్యుద్ధం..ఎవరు బయటకి పోతారో?

నిజమే! కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ నేతలే ఓడించుకొంటారు…మరెవరికీ ఆ అవకాశమే ఇవ్వరని టీ-కాంగ్రెస్ నేతలు నిరూపిస్తున్నారు. పార్టీ ఎంపి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మళ్ళీ జానారెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఈసారి డిల్లీ వెళ్లి ఆయనపై కాంగ్రెస్ అధిష్టానానికి పిర్యాదులు చేసిన తరువాత ఆరోపణలు చేశారు. “తెలంగాణా కాంగ్రెస్ లో కొంతమంది సీనియర్ నేతలు ఒక్కొక్కరు రూ. 1,000 కోట్లు, 800 కోట్లు విలువగల కాంట్రాక్టులు దక్కించుకొని, తెరాసకి తొత్తులుగా మారి, కాంగ్రెస్ పార్టీలో దాని కోవర్టులుగా పనిచేస్తున్నారు. వారెవరో నేను ఇదివరకే చెప్పాను. కనుక మళ్ళీ వారి పేర్లను నేను చెప్పనవసరంలేదు. వారెవరో తెలంగాణాలో ప్రతీ ఒక్కరికీ తెలుసు. వారి కాంట్రాక్టులు, దాని కోసం పార్టీకి వారు చేస్తున్న నష్టం గురించి నేను సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు లేఖలు వ్రాశాను. స్వయంగా కలిసి పిర్యాదు చెప్పాను. ఇప్పటికైనా వారు మర్యాదగా తమ పదవులకి, పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవాలి లేకుంటే పార్టీయే వాళ్ళని బయటకి పంపించే పరిస్థితి వస్తుంది,” అని హెచ్చరించారు.

ఆయన ఆరోపణలకి తీవ్రంగా స్పందించిన జానారెడ్డి తన ఎమ్మెల్యే పదవితో సహా అన్ని పదవులకి రాజీనామా చేసి ఒక సామాన్య కార్యకర్తగా పార్టీ కోసం పనిచేయడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు. తద్వారా పదవుల కోసం తాను ఆరాటపడుతున్నాననే అపవాదుని తొలగించుకొంటానని చెప్పారు. అయితే ముందుగా సోనియా గాంధీని కలిసి ఆమెకి పరిస్థితులన్నీ వివరించిన తరువాతనే రాజీనామా చేస్తానని అన్నారు.

పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆరోపణలు చేయగానే జానారెడ్డి వాటిని గట్టిగా ఖండించి ఉంటే అవి నిజం కాదని చెప్పినట్లుండేది. కానీ ఆయన ఖండించకుండా తన పదవులకి రాజీనామా చేస్తానని మాత్రమే చెప్పారు. అంటే పాల్వాయి ఆరోపణలను అంగీకరించినట్లే అయ్యింది. పైగా సోనియా గాంధీని కలిసి సంజాయిషీ చెప్పుకొంటానని చెప్పడంతో వాటిని దృవీకరించినట్లయింది. జానారెడ్డిపై అటువంటి తీవ్రమైన ఆరోపణలు చేసినందుకు పాల్వాయికి టీ-కాంగ్రెస్ షో-కాజ్ నోటీసు పంపింది. జూన్ 17న స్వయంగా హాజరై సంజాయిషీ చెప్పుకోవలసిందిగా ఆదేశించింది. కానీ ఆయనకి బదులు జానారెడ్డి సంజాయిషీలు చెప్పుకొంటానని అంటున్నారు. వారిద్దరి పోరాటం పరాకాష్టకి చేరుకొంది కనుక ఇద్దరిలో ఎవరో ఒకరు పార్టీ నుండి బయటకిపోవడం తధ్యంలాగ కనబడుతోంది. ఎవరు వెళ్లిపోతారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close