సాయిధరమ్ ఖతర్నాక్ కిలాడీ అండీ బాబూ. మూడు సినిమాలు చేశాడో లేదో.. అప్పుడే మనోడిపై బోల్డన్ని రూమర్లు వచ్చేశాయి. ఓ హీరోయిన్‌తో చాలా ఇదిగా తిరుగుతున్నాడని ఇండ్రస్ట్రీలో బీభత్సమైన టాక్ ఉంది. దానికి తోడు.. సాయి లైఫ్‌లో బోల్డన్ని లవ్ స్టోరీలు కూడా నడిచాయట. ఆ ప్రేమకథలన్నింటికీ గౌతమ్ మీనన్ సినిమాలే స్ఫూర్తి అంటున్నాడు సాయిధరమ్. సాహసం స్వాసగా సాగిపో ఆడియో ఫంక్షన్‌ని సాయిధరమ్ అతిథిగా వచ్చాడు. ఎదురుగా గౌతమ్ మీనన్ ఉన్నాడన్న ఉత్సాహంతోనో.. లేదంటే రెహమాన్ పాటలు స్ఫూర్తి నింపాయో తెలీదుగానీ.. తన ప్రేమ కథల్ని వరుసబెట్టి బయటపెట్టేశాడు.
చెలి టైమ్ లో మాధవన్ టైపులో ఓ అమ్మాయిని ప్రేమించాడట. సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా చూసి… ఓ అమ్మాయి కోసం అమెరికా వెళ్లిపోయాడట. ఏం మాయ చేశావె, ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాల స్ఫూర్తితో మరో ఇద్దరి ప్రేమించాడట. ఇదంతా సరదాగా చెప్పాడా, లేదంటే నిజంగానే సాయికి ఇన్ని లవ్ స్టోరీలున్నాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.నిజంగా ఈ లవ్ స్టోరీలన్నీ నిజమైతే సాయి మామూలోడు కాదన్నమాట.